ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుమరిలో ‘అల’జడి

ABN, First Publish Date - 2022-05-18T13:37:33+05:30

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కన్నియాకుమారిలో మూడో రోజూ సముద్రం వెనక్కిమళ్ళటంతో స్థానికులు, జాలర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో అలలు తీరం వైపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                          - మూడోరోజూ వెనక్కి మళ్లిన తీరం


చెన్నై: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కన్నియాకుమారిలో మూడో రోజూ సముద్రం వెనక్కిమళ్ళటంతో స్థానికులు, జాలర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో  అలలు తీరం వైపు ఎగసిపడ్డాయి. కన్నియాకుమారి జిల్లాలో ప్రతియేటా జూన్‌, జూలై నెలల్లో సముద్రతీరంలో అలల తాకిడి తీవ్రంగా ఉంటుంది. సుమారు నాలుగు నుంచి ఆరు మీటర్ల ఎత్తువరకూ రాక్షస అలలు ఎగపిసపడుతుంటాయి. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా కన్నియాకుమారి జిల్లాలోని  తీర ప్రాంతాల్లో సముద్రం వెనక్కిమళ్ళింది. సుమారు వందడుగుల దూరానికి తీరం వెనక్కిమళ్ళటంతో స్థానికులు దిగ్ర్భాంతి చెందారు. మంగళవారం ఉదయం కన్నియాకుమారి, చిన్నముట్టం, ఆరోగ్యపురం, కోవళం, వావతురై, కీళ్‌మనక్కుడి ప్రాంతాల్లో అలల ఉదృతి తీవ్రరూపం దాల్చింది. పది నుండి 15 అడుగుల ఎత్తువరకూ తీరం వైపు అలలు దూసుకువచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో  సముద్రం వెనక్కి వెళ్లడంతో తీరం పొడవునా బండరాళ్ళు, నాచు అధికంగా కనిపించాయి. ఈ నేపథ్యంలో కన్నియకుమారిలోని వివేకానంద స్మారక మంటపం, తిరువళ్ళువర్‌ విగ్రహ ప్రాంతానికి పూంపుహార్‌ సంస్థ ఆధ్వర్యంలో నడుపుతున్న బోట్‌సఫారీని రద్దు చేశారు. 

Updated Date - 2022-05-18T13:37:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising