ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా నది తీర గ్రామాలకు హెచ్చరికలు

ABN, First Publish Date - 2022-07-12T16:45:45+05:30

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇప్పటికే నారాయణపూర్‌ బసవసాగర్‌ జలాశయం పూర్తిగా నీటితో నిండిందని జిల్లా అధికారులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                  - నారాయణపూర్‌ బసవసాగర్‌ నుంచి 10 వేల క్యూసెక్కుల విడుదల


రాయచూరు(బెంగళూరు), జూలై 11: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇప్పటికే నారాయణపూర్‌ బసవసాగర్‌ జలాశయం పూర్తిగా నీటితో నిండిందని జిల్లా అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం రోజూ 3,892 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా సోమవారం రాత్రి నుంచి 10 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలోని లింగసుగూరు, రాయచూరు తాలూకాల పరిధిలో ఉన్న కృష్ణా నది తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తీర గ్రామాల్లో పెద్ద ఎత్తున డప్పుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. నది దగ్గరకు వెళ్లవద్దని, పశువులను సైతం నది చెంతకు వెళ్లనివ్వకుండా కట్టడి చేయాలన్నారు. ఇదే సమయంలో ముసురు వర్షాలు కురుస్తున్న కారణంగా ప్రజలు తాగే నీళ్లను కాచిచల్లార్చి వడబోసి తాగాలని అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-07-12T16:45:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising