ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణ, కావేరి నదుల ఆధునికీకరణ

ABN, First Publish Date - 2022-08-17T17:44:31+05:30

రాష్ట్రంలోని ప్రముఖ నదులైన కావేరి, కృష్ణ(Kaveri, Krishna) పునరుజ్జీవనం, ఆధునికీకరణ కోసం కేంద్రప్రభుత్వం డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- డీపీఆర్‌ సిద్ధం చేసిన కేంద్రం 

- అంచనా వ్యయం రూ.5,396 కోట్లు 


బెంగళూరు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రముఖ నదులైన కావేరి, కృష్ణ(Kaveri, Krishna) పునరుజ్జీవనం, ఆధునికీకరణ కోసం కేంద్రప్రభుత్వం డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌)ను సిద్ధం చేసింది. ఇందుకు సుమారు రూ.5,396 కోట్లు ఖర్చు కాగలవని అంచనా వేస్తున్నారు. భారతీయ అటవీ పరిశోధన విద్యాసంస్థ (ఐసీఎఫ్ఆర్‌ఈ)కు దేశంలోని 13 నదుల అనుసంధానం, పునరుజ్జీవనానికి సంబంధించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాల్సిందిగా కేంద్ర జలవనరులశాఖ సూచించింది. కర్ణాటక పరిధిలోని కృష్ణ, కావేరి నదీ పరీవాహక ప్రాంతాలకు ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు ద్వారా కృష్ణ, కావేరి బేసిన్‌లో పూడిక తొలగించడం, మొక్కలు నాటడం వంటివాటిని చేపడతారు. భూగర్భ జలాలను పెంచేందుకు, మురుగునీరు నదుల్లో చేరకుండా ప్రత్యేక సంస్కరణ విభాగాలు ఏర్పాటు చేయడం వంటివి ఉంటాయని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి గోవింద కారజోళ(Minister Govinda Carajola) వెల్లడించారు. ఈ పథకం అమలైతే కృష్ణ నదీ పరీవాహక ప్రాంతానికి 2,315 కోట్లు, కావేరి నదీ పరీవాహక ప్రాంతానికి రూ.1,867 కోట్లు లభిస్తాయన్నారు. అటవీశాఖ, వ్యవసాయశాఖ, నగరాభివృద్ధిశాఖ, గ్రామీణాభివృద్ధిశాఖలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టు పనుల్లో పాలు పంచుకుంటాయన్నారు. కృష్ణ, కావేరి నదుల పునరుజ్జీవన కార్యక్రమం పూర్తయితే పరీవాహక ప్రాంతాల్లో వేలాది హెక్టార్లు సాగులోకి వస్తాయని, వర్షాధారిత ప్రాంతాలకు ఒకింత ఉపశమనం లభిస్తుందన్నారు. నీరు వృథాగా సముద్రంలో కలిసే ప్రక్రియకు కూడా ఈ పథకం కొంతమేరకు అడ్టుకట్ట వేస్తుందన్నారు. 

Updated Date - 2022-08-17T17:44:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising