ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mathura Caseలో యథాతథ స్థితి కోసం 3 పిటిషన్ల దాఖలు

ABN, First Publish Date - 2022-05-28T13:30:45+05:30

కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం కేసులో మసీదు ఆవరణలో యథాతథ స్థితిని కొనసాగించాలని కోరుతూ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో మూడు దరఖాస్తులు దాఖలయ్యాయని అధికారులు చెప్పారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మథుర: కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం కేసులో మసీదు ఆవరణలో యథాతథ స్థితిని కొనసాగించాలని కోరుతూ సీనియర్ సివిల్ జడ్జి  కోర్టులో మూడు దరఖాస్తులు దాఖలయ్యాయని అధికారులు చెప్పారు.శ్రీకృష్ణుడి వారసుడని చెప్పుకునే లక్నో నివాసి మనీష్ యాదవ్ పేరిట దాఖలైన దావాలో భాగంగా జ్యోతి సింగ్ కోర్టులో దరఖాస్తులు సమర్పించారు.కాట్రా కేశవ్ దేవ్ ఆలయానికి చెందిన 13.37 ఎకరాల స్థలంలో మసీదు నిర్మించారని పిటిషనర్లు పేర్కొన్నారు.అంతకుముందు మసీదును సర్వే చేయాలంటూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. వేసవి సెలవుల తర్వాత కోర్టులను పునర్ ప్రారంభించాక తదుపరి విచారణ జులై 1గా కోర్టు నిర్ణయించింది. మసీదు ప్రాంగణంలో యథాతథ స్థితిని కొనసాగించడం,ఇద్దరు అసిస్టెంట్ అడ్వకేట్ కమిషనర్‌లను నియమించడం, జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని ఆదేశించడం, అడ్వకేట్ కమిషనర్ ద్వారా మసీదును తనిఖీ చేయాలని పిటిషన్లు వచ్చాయని జిల్లా ప్రభుత్వ న్యాయవాది (సివిల్) సంజయ్ గౌర్ చెప్పారు.మసీదు లోపల హిందూ దేవాలయాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన చిహ్నాలు ఖననం చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు.మసీదు ప్రాంగణంలో యథాతథ స్థితిని నెలకొల్పడమే ఏకైక పరిష్కారమని న్యాయవాది మరో పిటిషనులో కోరారు.




Updated Date - 2022-05-28T13:30:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising