ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bjp అక్రమాలే ప్రచారాస్త్రాలు

ABN, First Publish Date - 2022-07-13T16:33:58+05:30

రానున్న శాసనసభ ఎన్నికల ప్రణాళికల రూపకల్పనలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని కేపీసీసీ అ ధ్యక్షుడు డీకే శివకుమార్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- దర్యాప్తు అధికారులపై ఒత్తిడి తగదు 

- కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ 


బెంగళూరు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రానున్న శాసనసభ ఎన్నికల ప్రణాళికల రూపకల్పనలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని కేపీసీసీ అ ధ్యక్షుడు డీకే శివకుమార్‌ ప్రకటించారు. బెంగళూరు సదాశివనగర్‌లోని తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, బీజేపీ ప్రభుత్వంలో తారస్థాయికి చేరిన అవినీతి వంటివి తమ ప్రచారాస్త్రాలు కానున్నాయని పేర్కొన్నారు. సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌ అంటూనే బీజేపీ ప్రభుత్వం అజాన్‌, హలాల్‌ వంటి అంశాల్లో యువత మనసులను కలుషితం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎన్నడూ హిందూ మతాన్ని వ్యతిరేకించదని ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్య్ర పోరాటాలకు కాంగ్రెస్‌ నాయకత్వం వహించిందని, ఆ సమయంలో అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి నడిపించిందన్నారు. రాష్ట్రంలో యు వత ఆకాంక్షలను సాకారం చేసే దిశలో ఎన్నికల ప్రణాళికకు తుదిమెరుగులు దిద్దుతున్నామన్నారు. యువత కాంగ్రెస్‌ వెంటే నడుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వ అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని, ఇటీవలి కా లంలో ఉన్నతాధికారులు వరుసగా అరెస్టు అవుతుండడం, హైకోర్టు న్యాయమూర్తులనే కొందరు బెదిరించేస్థాయికి వెళ్లడం రాష్ట్రంలో బీజేపీ మార్కు అరాచక పాలనకు సంకేతమన్నారు. కాంగ్రెస్‏లో ఎలాంటి వర్గాలు లేవని అంతా కలసికట్టుగానే ముందుకు సాగుతామన్నారు. బీజేపీ తమ పార్టీపై నిందలు వేసేముందు సొంత పార్టీని చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. 

Updated Date - 2022-07-13T16:33:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising