ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలంటే Bjpకి భయం

ABN, First Publish Date - 2022-07-21T17:58:57+05:30

ఎన్నికలంటే అధికార బీజేపీకి భయం పట్టుకుందని అందుకే వీటిని వాయిదా వేయించేందుకు సాకులు వెతుకుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                  - వాయిదాకు సాకులు: Congress


బెంగళూరు, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలంటే అధికార బీజేపీకి భయం పట్టుకుందని అందుకే వీటిని వాయిదా వేయించేందుకు సాకులు వెతుకుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ బెంగళూరులో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ, బీబీఎంపీ ఎన్నికలు తక్షణం నిర్వహించేలా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తగిన మార్గదర్శకాలు చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జీఎస్టీ బాదుడుతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉందని, ప్రస్తుతం ఎన్నికలకు వెళితే ప్రతికూల ఫలితాలు తప్పవని బీజేపీ భయపడుతోందన్నారు. మధ్యప్రదేశ్‌లోనూ పన్నుపోటు కారణంగానే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడి అక్కడ ఎదురుదెబ్బలు తగిలిన సంగతిని గుర్తు చేశారు. 

  దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల బతుకును దుర్భరంగా మార్చేసిన బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ఎన్నికలకు వెళుతుందని ఆయన ప్రశ్నించారు. జీఎస్టీ వ్యవహారంపై ప్రజల్లోకి మరింత దూకుడుగా వెళతామని తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బండారాన్ని బయటపెడతామన్నారు. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సెంచరీ దాటేయగా గ్యాస్‌ ధర రూ.2వేల వైపు వడివడిగా పరుగులు తీస్తోందని ఎద్దేవా చేశారు. 


Updated Date - 2022-07-21T17:58:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising