ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

30 సెకన్లలో కొవిడ్‌ నిర్ధారణ!

ABN, First Publish Date - 2022-04-10T08:25:29+05:30

కరోనా అనుమానంతో ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు వెళ్తే ఫలితం కోసం ఇప్పటికీ 24 గంటలు వేచి ఉండాల్సి వస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 9: కరోనా అనుమానంతో ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు వెళ్తే ఫలితం కోసం ఇప్పటికీ 24 గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో మరింత సమయం కూడా పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన ఓ పరిశోధకుల బృందం ఓ పరికరాన్ని(డివైజ్‌) రూపొందించింది. తమ టెస్టింగ్‌ డివైజ్‌ సాయంతో 30 సెకన్లలోనే కరోనా పాజిటివ్‌ లేదా నెగెటివ్‌ అనే దాన్ని నిర్ధారించవచ్చని ఆ బృం దం చెబుతోంది. పీసీఆర్‌(పాలీమెరేస్‌ చెయిన్‌ రియాక్షన్‌) పరీక్షల మాదిరిగానే తమ డివైజ్‌ కూడా 90ు కచ్చితమైన ఫలితాలిస్తుందంటోంది. సలైవా(ఉమ్ము) నమూనాల ఆధారంగా వైరస్‌, యాంటీబాడీలను లెక్కగట్టే ఈ పరికరానికి యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి అనుమతి లభించాల్సి ఉంది.

మూడో వంతు జనాభాకు అందని వ్యాక్సిన్‌ 

ప్రపంచవ్యాప్తంగా భారీగా నమోదవుతున్న కరోనా కేసులపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సగటున ప్రతి 4 నెలలకు ఓసారి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని, ఆ ప్రభావంతో కేసులు భారీగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. పరిస్థితులు చూస్తుంటే కరోనా ఇప్పట్లో అంతమయ్యేలా లేదన్నారు. ఆసియాలో వ్యాప్తి తీవ్రంగా ఉందని, కొత్త వేవ్‌ యూర్‌పను కమ్మేస్తోందన్నారు.

Updated Date - 2022-04-10T08:25:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising