ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kodanadu వ్యవహారం.. మాజీ ఎమ్మెల్యేని విచారించిన ప్రత్యేక బృందం

ABN, First Publish Date - 2022-07-13T14:06:46+05:30

కొడనాడు హత్య, దోపిడీ వ్యవహారంలో అన్నాడీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టిని ప్రత్యేక బృందం మళ్లీ విచారించింది. నీలగిరి జిల్లా కోతగిరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), జూలై 12: కొడనాడు హత్య, దోపిడీ వ్యవహారంలో అన్నాడీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టిని ప్రత్యేక బృందం మళ్లీ విచారించింది. నీలగిరి జిల్లా కోతగిరి సమీపంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ చెందిన కొడనాడు ఎస్టేట్‌లో 2017లో వాచ్‌మెన్‌ హత్య, దోపిడీ వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంలో సయాన్‌, వాళయార్‌ మనోజ్‌ సహా పదిమందిని కోతగిరి పోలీసులు అరెస్ట్‌ చేయగా, ఈ కేసు విచారణ ఊటీ కోర్టులో జరుగుతోంది. తాజాగా ఈ కేసు పునర్విచారణకు దక్షిణ మండల ఐజీ సుధాకర్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఐదు ప్రత్యేక బృందాలు విచారణ వేగవంతం చేశాయి. దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టి, ఆయన కుమారుడు అశోక్‌బాబును ప్రత్యేక బృందం విచారించింది. కాగా, రెండు నెలల కిత్రం వీరిదద్దరినీ ప్రత్యేక బృందం విచారించింది.

Updated Date - 2022-07-13T14:06:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising