ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1000 ట్రిప్పులు పూర్తి చేసుకున్న కిసాన్ రైలు

ABN, First Publish Date - 2022-02-04T23:31:56+05:30

గురువారం మహారాష్ట్రలోని సావ్దా రైల్వే స్టేషన్‌లో కిసాన్ రైటు వెయ్యవ పరుగును కేంద్ర మంత్రులు వర్చువల్ ద్వారా ప్రారంభించారు. అనంతరం రైల్వే మంత్రి మాట్లాడుతూ ‘‘రైతుల కోసం మోదీ ప్రభుత్వం ఇప్పటికి చాలా చేసింది. ఇక ముందు కూడా ఎంతగానో చేస్తుంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కిసాన్ రైలు ఫిబ్రవరి 3, 2020 నాటికి వెయ్యి ట్రిప్పుల పరుగుతు పూర్తి చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సంయుక్తంగా పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను విస్తృత మార్కెట్‌లో అందించే, రైతులకు మేలు చేకూర్చే ఉద్దేశంతో ఈ రైలును ప్రారంభించినట్లు రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2020 ఆగస్టు 7న మొట్టమొదటి కిసాన్ రైలును ప్రారంభించారు. మహారాష్ట్రలోని సావ్దా, ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్ మధ్య ప్రయాణించే 23 బోగీలు గల రైలు 435 టన్నుల అరటిపళ్లను రవాణా చేసిందని మంత్రులు అన్నారు. మొత్తంగా 3.45 టక్షల వ్యవసాయ ఉత్పత్తులు కిసాన్ రైలులో రవాణా అవుతున్నాయని వారు పేర్కొన్నారు.


గురువారం మహారాష్ట్రలోని సావ్దా రైల్వే స్టేషన్‌లో కిసాన్ రైటు వెయ్యవ పరుగును కేంద్ర మంత్రులు వర్చువల్ ద్వారా ప్రారంభించారు. అనంతరం రైల్వే మంత్రి మాట్లాడుతూ ‘‘రైతుల కోసం మోదీ ప్రభుత్వం ఇప్పటికి చాలా చేసింది. ఇక ముందు కూడా ఎంతగానో చేస్తుంది. దేశ రైతుల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మేం ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేర్చుకుంటాం. రైతే రారాజు అన్న విధంగా వారి ఆర్థిక శక్తిని పెంచుతాం’’ అని అన్నారు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ మాట్లాడుతూ ‘‘ఈ దేశం వ్యవసాయ దేశం. వ్యవసాయ పరమైన చర్యలు సమర్థవంతంగా అమలు జరిగినప్పుడే దేశం పురోభివృద్ధి సాధిస్తుంది. ఆ విషయంలో మేం సమర్ధవంతంగా పని చేస్తున్నాం’’ అని అన్నారు.

Updated Date - 2022-02-04T23:31:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising