ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

King Charles III : హిల్స్‌బరో కేజిల్‌లో కింగ్ ఛార్లెస్-3 అసహనం

ABN, First Publish Date - 2022-09-14T17:49:20+05:30

నార్తర్న్ ఐర్లాండ్‌లోని హిల్స్‌బరో కేజిల్‌లో జరిగిన సంఘటన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్ : నార్తర్న్ ఐర్లాండ్‌లోని హిల్స్‌బరో కేజిల్‌లో జరిగిన సంఘటన కింగ్ ఛార్లెస్-3కి చాలా ఆగ్రహం తెప్పించింది. సందర్శకుల పుస్తకంలో సంతకం చేసేటపుడు ఆయన రాస్తున్న కలం నుంచి సిరా కారిపోతుండటంతో ఆయన అసహనం ప్రదర్శించారు. విచారకర సమయంలో ఇలాంటివాటిని తాను సహించలేనని అన్నారు. కింగ్ అసహనం ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 


కింగ్ ఛార్లెస్-3, క్వీన్ కన్సార్ట్ కేమిలా కలిసి నార్తర్న్ ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్ సమీపంలో ఉన్న హిల్స్‌బరో కేజిల్‌కు వెళ్ళారు. అక్కడ సందర్శకుల పుస్తకంలో సంతకం చేసేటపుడు కింగ్ ఛార్లెస్ చేతిలోని కలం (Pen) నుంచి సిరా కారుతోంది. దాంతో ఆయనకు చాలా కోపం వచ్చింది. ఓరి దేవుడా, ఈ పెన్‌ని హేట్ చేస్తున్నానన్నారు. ఇబ్బందికర పరిస్థితిలో  ఇలాంటివాటిని తాను సహించలేనన్నారు. వెంటనే ఆ పెన్‌ను కేమిలాకు ఇచ్చారు. ఆయన తన వేళ్ళను తుడుచుకుంటుండగా, కేమిలా కూడా ఆ పెన్ నుంచి సిరా కారుతుండటాన్ని చూసి, ‘ఓహ్, చూడండి, ఇది అన్ని వైపులకు పోతోంది’ అన్నారు.


బ్రిటన్ మహారాజుగా తనను ప్రకటించే సమయంలో కూడా కింగ్ ఛార్లెస్-3 అసహనం ప్రదర్శించారు. టేబుల్ పైన ఉన్న పెన్ బాక్స్, ఇంక్‌వెల్‌లను తొలగించాలని ఓ సహాయకుడిని అసహనంతో ఆదేశించారు.



ఈ నెల 8న క్వీన్ ఎలిజబెత్-2 మరణించడంతో ఛార్లెస్-3 బ్రిటన్ మహారాజు అయ్యారు. 


Updated Date - 2022-09-14T17:49:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising