ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆప్‌’లో ఉన్నవారంతా అలాంటి వారే: గుజరాత్ బీజేపీ చీఫ్

ABN, First Publish Date - 2022-05-02T00:57:07+05:30

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ పర్యటనపై బీజేపీ గుజరాత్ చీఫ్ సీఆర్ పాటిల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంధీనగర్: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ పర్యటనపై బీజేపీ గుజరాత్ చీఫ్ సీఆర్ పాటిల్ తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్‌తో జాతీయ  భద్రతకు ముప్పు పొంచి ఉందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో ఖలిస్థాన్ ఆలోచనాపరులకు పార్టీలో బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు. ఖలిస్థాన్‌ను రాజ్యాంగ హక్కుగా కోరుతున్నారని, ఫలితంగా జాతీయ భద్రతకు ముప్పుగా తయారయ్యారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 


కాగా, భరూచ్‌లో నేడు (ఆదివారం) నిర్వహించిన ఆదివాసీ సంకల్ప్ మహాసమ్మేళన్‌లో పాల్గొన్న కేజ్రీవాల్ మాట్లాడుతూ.. పాటిల్‌ను ఉద్దేశించి బీజేపీపై విరుచుకుపడ్డారు. గుజరాత్ బీజేపీ పగ్గాలు అప్పగించేందుకు బీజేపీకి ఒక్క గుజరాతీ కూడా కనిపించలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఇది అవమానకరమని అన్నారు. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి గుజరాత్‌ను నడిపిస్తాడా? అని ప్రశ్నించారు. మహారాష్ట్రలోని జలగావ్‌కు చెందిన పాటిల్ గుజరాత్‌లోని నవసారీ నుంచి ఎంపీగా ఉన్నారు. 


మరోవైపు, పాటిల్ ట్వీట్‌పై ఆప్ గుజరాత్ నేత ఇసుదాన్ గధ్వి స్పందించారు. కేజ్రీవాల్‌ దేశభక్తుడని, ఆయనలో నిజాయతీ, మానవత్వం ఉన్నాయన్నారు. అందుకే ప్రజలు ఆయనను ఇష్టపడుతున్నారని అన్నారు. కేజ్రీవాల్ అత్యుత్తమ విద్యను, ఆరోగ్య సేవలను, భద్రతను అందిస్తున్నారని, పాటిల్ సర్టిఫికెట్ తమకు అవసరం లేదని తేల్చి చెప్పారు.  

Updated Date - 2022-05-02T00:57:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising