ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nupur Sharma తల నరికిన వారికి ఇల్లు ఇస్తానన్న Ajmer Dargah ఖాదిమ్ అరెస్ట్

ABN, First Publish Date - 2022-07-06T14:30:05+05:30

మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ తల నరికి చంపిన వారికి తన ఇంటిని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అజ్మీర్(రాజస్థాన్):మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ తల నరికి చంపిన వారికి తన ఇంటిని బహుమతిగా ఇస్తానని ప్రకటించిన అజ్మీర్ దర్గా ఖాదీమ్ సల్మాన్ చిస్తీని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు.నూపుర్ శర్మను తల నరికి చంపిన ఎవరికైనా తన ఇంటిని బహుమతిగా ఇస్తానని సల్మాన్ చిస్తీ వివాదాస్పద వీడియోలో పేర్కొన్నాడు. దీంతో అజ్మీర్ దర్గా ఖాదీమ్ సల్మాన్ చిస్తీని అజ్మీర్ పోలీసులు మంగళవారం అర్దరాత్రి 12.45గంటలకు అరెస్ట్ చేసినట్లు అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వికాస్ సంగ్వాన్ తెలిపారు.నూపుర్ శర్మను బెదిరించిన వీడియో వైరల్ అయింది.మూడు నిమిషాల వీడియోలో సల్మాన్ చిస్తీ తన మతపరమైన భావాలను కారణంగా చూపుతూ నూపుర్ శర్మను చంపేస్తానని బహిరంగంగా బెదిరించాడు.


‘‘నాకు జన్మనిచ్చిన మా అమ్మపై ప్రమాణం చేస్తున్నాను, నేను నూపుర్ శర్మను బహిరంగంగా కాల్చివేస్తాను. నేను నా పిల్లలపై ప్రమాణం చేస్తున్నాను, నేను ఆమెను కాల్చివేస్తాను ఈ రోజు కూడా నేను చెబుతున్నాను, నూపుర్ శర్మ తల ఎవరు తీసుకువస్తే, అతనికి నా ఇల్లు బహుమతిగా ఇస్తాను’’  అని సల్మాన్ చిస్తీ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో అజ్మీర్ నగరంలోని అల్వార్ గేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ వీడియో విషయంలో తాము చాలా కఠిన వైఖరిని అవలంబిస్తున్నారని అజ్మీర్ ఏఎస్పీ వికాస్ సంగ్వాన్ తెలిపారు. వీడియోలో సల్మాన్ చిస్తీ మద్యం తాగిన స్థితిలో కనిపించాడని ఏఎస్పీ సాంగ్వాన్ చెప్పారు.


Updated Date - 2022-07-06T14:30:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising