ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tribute To Bravehearts : కీలక కార్గిల్ పర్వత శిఖరానికి కొత్త పేరు

ABN, First Publish Date - 2022-07-31T00:01:09+05:30

ఆపరేషన్ విజయ్ (Operation Vijay) యుద్ధ వీరుల స్మారకార్థం కార్గిల్‌లోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఆపరేషన్ విజయ్ (Operation Vijay) యుద్ధ వీరుల స్మారకార్థం కార్గిల్‌లోని కీలకమైన శిఖరానికి గన్ హిల్ (Gun Hill) అని పేరు పెట్టారు. 1999లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌ (Pakistan)పై విజయం సాధించడానికి గన్నర్స్ నిర్వహించిన ముఖ్యమైన పాత్రకు గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 


శత్రు దేశమైన పాకిస్థాన్ (Pakistan) సేనలు కార్గిల్ సెక్టర్‌లో ఆక్రమించుకున్న అత్యంత ఎత్తయిన శిఖరాల్లో పాయింట్ 5140 ఒకటి. దీనిని ‘పరమవీర చక్ర’ కెప్టెన్ విక్రమ్ బాత్రా (Captain Vikram Batra) నేతృత్వంలోని యోధుల బృందం 1999 జూన్ 20న తిరిగి స్వాధీనం చేసుకుంది. విక్రమ్ బాత్రాను కార్గిల్ హీరో (Kargil Hero)గా గౌరవించుకుంటున్నాం. కార్గిల్ యుద్ధానికి ‘ఆపరేషన్ విజయ్’ (Operation Vijay) అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే.


రక్షణ మంత్రిత్వ శాఖ (defence ministry) విడుదల చేసిన ప్రకటనలో, భారత రక్షణ దళాల విజయాన్ని స్మరించుకునేందుకు, ‘ఆపరేషన్ విజయ్’లో గన్నర్స్ ఆత్మ బలిదానాలకు నివాళులర్పించేందుకు, కార్గిల్ సెక్టర్, ద్రాస్‌లోని పాయింట్ 5140కు ‘గన్ హిల్’ అని పేరు పెట్టినట్లు తెలిపింది. పాయింట్ 5140ను స్వాధీనం చేసుకోవడం వల్ల ఈ యుద్ధం త్వరగా పూర్తయినట్లు తెలిపింది. 


1999 జూలై 26న కార్గిల్ యుద్ధం ముగిసిందని భారత సైన్యం ప్రకటించింది. ఆపరేషన్ విజయ్ విజయవంతమైందని తెలిపింది. 


Updated Date - 2022-07-31T00:01:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising