ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉజ్జయిని మహాకాళేశ్వరునికి గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పూజలు

ABN, First Publish Date - 2022-01-08T23:30:56+05:30

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ శనివారం మధ్య ప్రదేశ్‌లోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉజ్జయిని : కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ శనివారం మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా కాళేశ్వరునికి హారతి సేవ సమయంలో ఆయన పూజలు చేసినట్లు దేవాలయం యంత్రాంగం ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలోని 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఉజ్జయిని ఒకటి. 


ఉజ్జయిని మహాకాళేశ్వర దేవాలయం ప్రతినిధి గణేశ్ ధాకడ్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ శనివారం మహాకాళేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఆయన కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పూజలు చేసినట్లు తెలిపారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఆయనకు దేవాలయం అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికినట్లు చెప్పారు. ఆయన 40 నిమిషాలపాటు ఈ దేవాలయంలో గడిపారని పేర్కొన్నారు. 


మహాకాళేశ్వరుని దర్శనం చేసుకోవడం వల్ల ఎటువంటి అనుభూతి కలిగిందని పూజల అనంతరం విలేకర్లు అడిగిన ప్రశ్నకు గవర్నర్ ఆరిఫ్ సమాధానమిస్తూ, మూగవానికి మిఠాయి తినిపించి, దాని రుచి చెప్పమన్నట్లుగా ఈ ప్రశ్న ఉందని అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మహాకాళేశ్వరుని దర్శనం చేసుకోవడం తప్పనిసరి అన్నారు. ప్రస్తుతం మానవాళి చాలా ఇబ్బందుల్లో ఉందని, మానవాళికి మంచి జరగాలని, దేశం సుభిక్షంగా ఉండాలని మహాకాళేశ్వరుని కోరుకున్నానని, ఆశీర్వాదాలు పొందానని తెలిపారు. 


Updated Date - 2022-01-08T23:30:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising