ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

shawarma తిని ఫుడ్ పాయిజన్‌తో బాలిక మృతి

ABN, First Publish Date - 2022-05-02T12:55:48+05:30

ఓ పాఠశాల బాలిక షావర్మా తిని ఫుడ్ పాయిజన్‌తో మృతి చెందిన ఘటన కేరళ రాష్ట్రంలోని కన్హంగాడ్ జిల్లాలో వెలుగుచూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం : ఓ పాఠశాల బాలిక షావర్మా తిని ఫుడ్ పాయిజన్‌తో మృతి చెందిన ఘటన కేరళ రాష్ట్రంలోని కన్హంగాడ్ జిల్లాలో వెలుగుచూసింది. కన్హంగాడ్ జిల్లాకు చెందిన 19 మంది పాఠశాల విద్యార్థులు షావర్మా తిని ఫుడ్ పాయిజనింగ్ అవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. షావర్మా తిన్న 16 ఏళ్ల బాలిక ఫుడ్ పాయిజన్ కావడంతో చికిత్స పొందుతూ మరణించింది.మరో 18 మంది అస్వస్థతతో కరివల్లూర్‌కు చెందిన దేవానంద కన్హన్‌గాడ్ జిల్లా ఆసుపత్రిలో చేరారు.షావర్మా విక్రయించిన దుకాణంపై పోలీసులు కేసు నమోదు చేసి దాన్ని సీజ్ చేశారు. 18మంది విద్యార్థులు కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు.ఈ ఘటనపై కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు.


ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కేరళ మంత్రి ఎంవీ గోవిందన్ పరామర్శించారు.కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోటళ్లలో నాణ్యమైన భోజనం అందేలా చూస్తామని మంత్రి చెప్పారు.రెస్టారెంట్లలో అందించే ఆహారం నాణ్యమైనదిగా ఉండేలా ప్రభుత్వం కేరళ రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తుందని మంత్రి వివరించారు.


Updated Date - 2022-05-02T12:55:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising