ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kerala: సీనియర్ నేత P C Georgeకు bail నిరాకరించిన court

ABN, First Publish Date - 2022-05-25T22:22:32+05:30

విధ్వేష ప్రసంగాలు చేసిన కేసులో అరెస్టైన కేరళకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, కేరళ జనపక్షం సెక్యూలర్ పార్టీ నేత పీసీ జార్జ్‌(P C George)కు బెయిల్(bail) ఇచ్చేందుకు తిరువనంతపురం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు(court) నిరాకరించింది. చట్ట పరిధిని దాటి జార్జ్ ప్రవర్తించారని అందుకే ఆయనకు బెయిల్ నిరాకరిస్తున్నామని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: విధ్వేష ప్రసంగాలు చేసిన కేసులో అరెస్టైన కేరళకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, కేరళ జనపక్షం సెక్యూలర్ పార్టీ నేత పీసీ జార్జ్‌(P C George)కు బెయిల్(bail) ఇచ్చేందుకు తిరువనంతపురం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు(court) నిరాకరించింది. చట్ట పరిధిని దాటి జార్జ్ ప్రవర్తించారని అందుకే ఆయనకు బెయిల్ నిరాకరిస్తున్నామని బుధవారం కోర్టు పేర్కొంది. ఏప్రిల్ 29న కేరళ రాజధానిలో నిర్వహించిన హిందూ మహా సమ్మేళనంలో ధ్వేషపూరిత ప్రసంగం చేశారని జార్జ్‌ను మే 1న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమావేశంలో జార్జ్ మాట్లాడుతూ ముస్లింలు నిర్వహించే రెస్టారెంట్లకు వెళ్లవద్దని, ఎందుకంటే వారు నపుంసకత్వం వచ్చే కొన్ని రకాల చుక్కల్ని వంటల్లో వినియోగిస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా లవ్ జిహాద్, దేశాన్ని ఇస్లాంగా మార్చేందుకు ముస్లింలు ప్రయత్నిస్తున్నారని జార్జ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా మే9న కొచ్చిలోని ఒక దేవాలయ ప్రారంభోవత్సవంలో సైతం జార్జ్ విధ్వేష వ్యాఖ్యలు చేసినట్లు కేసు నమోదు అయింది.

Updated Date - 2022-05-25T22:22:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising