ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబైలో బీభత్సం సృష్టించిన కెన్యా వ్యక్తికి మానసిక స్థితి సరిగా లేదట

ABN, First Publish Date - 2022-06-03T21:24:39+05:30

‘‘దర్యాప్తు చేస్తున్న సమయంలో జాన్ చెప్పే విషయాల నుంచి అతడిని ఆరోగ్య పరీక్షలు చేశాం. అతడి మానసిక పరిస్థితి బాగోలేదని, ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని వైద్యులు తెలిపారు. దాడి గురించి ప్రస్తావిస్తే దేవుడి గురించి మాట్లాడుతున్నాడు’’ అని అన్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: బుధవారం ముంబైలో కత్తితో దాడి చేసి ఎనిమిది మందిని గాయపరిచిన కెన్యా వ్యక్తి కేసును విచారిస్తున్న పోలీసులు ఘటనకు గల కారణాన్ని వెల్లడించారు. దాడి పాల్పడ్డ వ్యక్తి మానసిక ఆరోగ్య పరిస్థితి బాగా లేదని ముంబై పోలీసులు శుక్రవారం తెలిపారు. ‘‘నిందితుడి పేరు జాన్(50), కెన్యా జాతీయుడు. దాడి జరిగిన రోజే అతడిని ఆజాద్ మైదాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాన్ చేసిన దాడిలో ఎనిమిది మంది గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా దక్షిణ ముంబైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు’’ అని ఒక పోలీసు అధికారి తెలిపారు.


ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘దర్యాప్తు చేస్తున్న సమయంలో జాన్ చెప్పే విషయాల నుంచి అతడిని ఆరోగ్య పరీక్షలు చేశాం. అతడి మానసిక పరిస్థితి బాగోలేదని, ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని వైద్యులు తెలిపారు. దాడి గురించి ప్రస్తావిస్తే దేవుడి గురించి మాట్లాడుతున్నాడు’’ అని అన్నారు. అయితే దాడిలో ఏదైనా ఉగ్రకోణం ఉందేమోన్న కోణంలో సైతం దర్యాప్తు చేశారట. అయితే వైద్యుల రిపోర్ట్ అనంతరం జాన్‌కు సన్నిహితులైన వారిని విచారించాలని నిర్ణయించుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.

Updated Date - 2022-06-03T21:24:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising