ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Target Kiliing: కశ్మీర్ పండిట్‌ కాల్చివేత..వారంలో ఇది రెండవది

ABN, First Publish Date - 2022-08-16T20:01:29+05:30

జమ్మూకశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. చోటిపోరా ప్రాంతంలోని యాపిల్ తోటలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. చోటిపోరా ప్రాంతంలోని యాపిల్ తోటలో (Apple Archard) ఉగ్రవాదులు మంగళవారంనాడు కాల్పులకు తెగబడటంతో కశ్మీర్ పండిట్ (Kashmir pandit) ఒకరు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. ఉగ్రవాదులు వారం రోజుల వ్యవధిలో జరిపిన రెండవ లక్షిత హత్య (Targeted killing) ఇది.


''ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బాధితులిద్దరూ మైనారిటీ వర్గానికి చెందిన వారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించాం. భద్రతా బలగాలు ఘటనా స్థలిని తమ అధీనంలోకి తీసుకున్నాయి'' అని జమ్మూకశ్మీర్ పోలీసులు ట్వీచ్ చేశారు. మృతిచెందిన వ్యక్తిని సునీల్ కుమార్‌గా గుర్తించారు.


గవర్నర్ సంతాపం..

కశ్మీర్ పండిట్ కాల్చివేత ఘటన పట్ల గవర్నర్ మనోజ్ సిన్హా ఓ ట్వీట్‌లో విచారం వ్యక్తం చేశారు. సోపియాన్ జిల్లాలో పౌరులపై ఉగ్రవాదుల దాడి గుండెల్ని పిండేస్తోందని, మృతుని కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని, ఇలాంటి పాశవిక చర్యలకు బాధ్యులైన ఉగ్రవాదులను విడిచి పెట్టే ప్రసక్తే లేదని అన్నారు.


బాధాకరం: మెహబూబా ముఫ్తీ

ఉగ్రవాదుల దుశ్చర్య పట్ల పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విచారం వ్యక్తం చేశారు. సోషియాన్‌లో టార్కెటెడ్ కిల్లింగ్ చాలా దురదృష్టకరమని, మృతుని కుటుంబానికి సంతాపం తెలుపుతున్నానని అన్నారు. భారత ప్రభుత్వం ఉష్ట్రపక్షిలా (Ostrich) ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు.


లక్షిత హత్యల పరంపర..

మూడు రోజుల క్రితం బీహార్‌కు చెందిన ఒక వలస కార్మికుని బండిపొర జిల్లాలో ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. మృతి చెందిన వ్యక్తిని మధేపురకు చెందిన మహమ్మద్ అమ్రెజ్‌ అనే చేనేత కార్మికునిగా గుర్తించారు. ఈ ఏడాది ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన నాలుగో స్థానికేతరుడు అమ్రెజ్ కావడం విశేషం. ఈ ఏడాది జరిగిన లక్షిత దాడుల్లో మొత్తం 14 మంది పౌరులు, ఆరుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు.


దత ఏడాది జనవరిలో అనంత్‌నాగ్‌ జిల్లాలో జరిగిన లక్షిత దాడిలో ఒక పోలీసు మరణించగా, మార్చిలో సోషియాన్ జిల్లాలో ఐదుగురు పౌరులు, ఒక సీఆర్‌పీఎఫ్ జవాను, బుద్గాంలో ఒక స్పెషల్ పోలీస్ అఫీసర్ (ఎస్‌పీఓ) ప్రాణాలు కోల్పోయారు. ఇదే దాడిలో ఎస్‌పీఓ సోదరుడు కూడా మృతిచెందాడు. గత ఏప్రిల్‌లో ఒక సర్పంచ్ సహా ఇద్దరు పౌరులు ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించగా, మేలో ఇద్దరు పోలీసులు, ముగ్గురు పౌరులు మృతిచెందారు. మృతుల్లో రాహుల్ భట్ అనే వ్యక్తి ప్రధానమంత్రి కశ్మీర్ పండిట్ల ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రభుత్వ ఉద్యోగం పొందగా, అమ్రీన్ భట్ టీవీ నటుడుగా, రజిన బాల టీచర్‌గా ఉన్నారు. జూన్‌లో స్థానికేతరుడైన బ్యాంకు మేనజర్, ఒక కార్మికుడు, ఒక ఎస్ఐని ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఆగస్టులో ఇంతవరకూ ఇద్దరు స్థానికేతర కార్మికులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు.

Updated Date - 2022-08-16T20:01:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising