ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nupur Sharma Row: రెచ్చగొట్టే వీడియో చేసినందుకు యూట్యూబర్ అరెస్ట్

ABN, First Publish Date - 2022-06-11T22:31:52+05:30

మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ (ఫొటో) తలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ : మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ (ఫొటో) తలను కత్తితో నరికినట్లు ప్రదర్శిస్తూ ఓ వీడియోను చిత్రీకరించినందుకు కశ్మీరుకు చెందిన యూట్యూబర్ ఫైజల్ వనీని అరెస్టు చేశారు. వనీ యూట్యూబ్‌లో ‘డీప్ పెయిన్ ఫిట్నెస్’ పేరుతో ఓ చానల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ వివరాలను జమ్మూ-కశ్మీరు పోలీసులు శనివారం మీడియాకు తెలిపారు. 


అంతకుముందు వనీ మాట్లాడుతూ, బీజేపీ నుంచి సస్పెండయిన నూపుర్ శర్మ తలను తెగ్గోసినట్లు ప్రదర్శిస్తూ వీడియోను తాను రూపొందించానని, అది క్షణాల్లోనే వైరల్ అయిందని చెప్పారు. అయితే తనకు ఎటువంటి దురుద్దేశాలు లేవన్నారు. తాను ఆ వీడియోను డిలీట్ చేశానన్నారు. ఆ వీడియో ఎవరినైనా గాయపరచి ఉంటే క్షమించాలని కోరానని చెప్పారు. 


నూపుర్ శర్మ గత నెలలో ఓ టీవీ చర్చా కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి హోదాలో మాట్లాడారు. ప్రవక్త మహమ్మద్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ముస్లిం దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అప్రమత్తమైన బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నూపుర్ శర్మతోపాటు మరో నేత నవీన్ జిందాల్‌పై చర్యలు తీసుకుంది. టీవీ చర్చల్లో పాల్గొనే ప్రతినిధులకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.


Updated Date - 2022-06-11T22:31:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising