ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karuna విగ్రహ ప్రతిష్ఠకు Highcourt గ్రీన్‌ సిగ్నల్‌

ABN, First Publish Date - 2022-06-15T14:50:12+05:30

తిరువణ్ణామలై గిరిప్రదక్షిణ మార్గంలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహం ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): తిరువణ్ణామలై గిరిప్రదక్షిణ మార్గంలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహం ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణ మార్గం, రాష్ట్ర రహదారి కలిసే చోట కరుణ విగ్రహాన్ని ఏర్పాటు చేయరాదని జి కార్తీక్‌ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాహిత వాజ్యం దాఖలు చేశారు. వేంగైకాల్‌ ప్రాంతంలో జీవి విద్యా ట్రస్టుకు చెందిన స్థలాన్ని కొనుగోలు చేసి ఆ చోట విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని, అది పట్టాభూమి కాదని, నీటికాల్వ ప్రాంతానికి చెందినదని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు విగ్రహ ప్రతిష్ట పనులను నిలుపుదల చేస్తూ స్టే విధించింది. అదే సమయంలో విగ్రహం ప్రతిష్ఠిచనున్న స్థలానికి సంబంధించిన వివరాలను కలెక్టర్‌, జీవా విద్యట్రస్టు నిర్వాహకులు సమర్పించాలని ఆదేశించింది. ఆ మేరకు కలెక్టర్‌ తరఫున, జీవా విద్యా ట్రస్టు తరఫున అఫిడవిట్లు దాఖలయ్యాయి. పిటిషనర్‌ పేర్కొన్నట్లు కరుణ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న స్థలం పట్టాభూమి అని, ఆక్రమిత స్థలం కాదని పేర్కొన్నారు. మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మునీశ్వర్‌నాధ్‌ భండారి, న్యాయమూర్తి జస్టిస్‌ మాలాతో కూడిన హైకోర్టు ప్రథమధర్మాసనం విచారణ చేప ట్టింది. కేసును ఉపసంహరించుకుంటామని పిటిషనర్‌ తరపు న్యాయవాది పేర్కొనడంతో కరుణ విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ అయినట్లయింది. 

Updated Date - 2022-06-15T14:50:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising