ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రమంతటా వరుణుడి కరుణ

ABN, First Publish Date - 2022-04-14T17:11:13+05:30

వేసవి తాపంతో తల్లడిల్లుతున్న ప్రజలకు ఊరటనిచ్చేలా వరుణుడు కరుణించాడు. గడిచిన నె లన్నర కాలంగా రాష్ట్రమంతటా ఎండల ప్రభా వం రోజురోజుకు తీవ్రమైంది. ఇటీవల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                          - వేసవి తాపం నుంచి ఊరట


బెంగళూరు: వేసవి తాపంతో తల్లడిల్లుతున్న ప్రజలకు ఊరటనిచ్చేలా వరుణుడు కరుణించాడు. గడిచిన నె లన్నర కాలంగా రాష్ట్రమంతటా ఎండల ప్రభా వం రోజురోజుకు తీవ్రమైంది. ఇటీవల ఉత్తరకర్ణాటక ప్రాంతంలో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసినా రాష్ట్రమంతటా వేడిమితో ప్రజలు ఇబ్బంది పడ్డారు. బుధవారం బెంగళూరుతోపాటు పలు ప్రాంతాలలో వర్షం కురిసింది. దీంతో సాయంత్రానికి చల్లటి వాతావరణం నెలకొంది. బెంగళూరు, మండ్య, మంగళూరు, ఉడుపి, ఉత్తరకన్నడ జిల్లాలతోపాటు మరిన్ని ప్రాంతాలలో ఓ మోస్తరుగా వర్షం కురిసింది. మండ్య పట్టణంలో ఈదురుగాలులతో 40 నిమిషాలకుపైగా వర్షం కురిసింది. బెంగళూరు - మైసూరు రహదారిపై నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బెంగళూరులో ఆర్‌టీనగర్‌, జయనగర్‌, చామరాజపేట, మల్లేశ్వరం సహా నగరం అంతటా వాన కురిసింది. కాగా రానున్న ఐదురోజులపాటు దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతాలలోనూ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధనశాఖ ప్రకటించింది. రానున్న రోజులు కేరళ, లక్షద్వీప్‌, తమిళనాడు, పుదుచ్చేరితోపాటు కర్ణాటక తీర ప్రాంత జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతాలో ఉరుములతో కూడిన వర్షాలు కురవవచ్చునని ప్రకటనలో పేర్కొంది. 

Updated Date - 2022-04-14T17:11:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising