ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PFI Ban : పీఎఫ్ఐపై నిషేధానికి యోచన : కర్ణాటక మంత్రి

ABN, First Publish Date - 2022-09-23T21:46:24+05:30

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (Popular Front of India-PFI

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (Popular Front of India-PFI)పై నిషేధం విధించే ప్రక్రియ ప్రారంభమైందని కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర (Araga Jnanendra) చెప్పారు. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గురువారం 15 మందిని ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకుందని, ఏడుగురిని అరెస్టు చేసిందని చెప్పారు. ఎఫ్ఐఆర్‌లను నమోదు చేసి, దర్యాప్తు చేస్తోందన్నారు. రాష్ట్ర పోలీసులు కూడా ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారని తెలిపారు. 


ఎన్ఐఏ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate), కర్ణాటక పోలీసులు గురువారం బెంగళూరు, మైసూరు, కలబురగి, శివమొగ్గలలో సోదాలు నిర్వహించారు. ఏడుగురు పీఎఫ్ఐ ఆఫీసు బేరర్లను అరెస్ట్ చేశారు. మంగళూరులో ఓ పీఎఫ్ఐ నేత ఇంటి వద్ద ధర్నా చేసిన దాదాపు 50 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డక్కప్ప సర్కిల్ వద్ద రోడ్డును దిగ్బంధనం చేసేందుకు కొందరు పీఎఫ్ఐ కార్యకర్తలు ప్రయత్నించారు. వీరు ఎన్ఐఏ, బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 


పీఎఫ్ఐ ఓ లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థగా ఏర్పాటైంది. మైనారిటీలు, దళితులు, అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడటమే తమ లక్ష్యమని అప్పట్లో ప్రకటించింది. ప్రస్తుతం దేశ భద్రతకు పెను ముప్పుగా మారిందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది. 


Updated Date - 2022-09-23T21:46:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising