ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కలుపుమొక్కలను పీకి పారేస్తాం’

ABN, First Publish Date - 2022-01-21T17:09:41+05:30

పోలీసు శాఖలో తిష్టవేసిన అవినీతి కలుపుమొక్కలను నిర్ధాక్షిణ్యంగా పీకిపారేస్తామని హోం శాఖా మంత్రి ఆరగ జ్ఞానేంద్ర హెచ్చరించారు. నగరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ధన మా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పోలీసుశాఖలో క్రమశిక్షణ తప్పనిసరి

- తప్పు చేస్తే కఠిన చర్యలు తథ్యం.. 

- హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర హెచ్చరిక


బెంగళూరు: పోలీసు శాఖలో తిష్టవేసిన అవినీతి కలుపుమొక్కలను నిర్ధాక్షిణ్యంగా పీకిపారేస్తామని హోం శాఖా మంత్రి ఆరగ జ్ఞానేంద్ర హెచ్చరించారు. నగరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ధన మాన ప్రాణాలకు, ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే దారితప్పితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయంలోని భద్రతా విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు పోలీసులు మాదకద్రవ్యాల వ్యవహారంలో నిమగ్నమైనట్లు తేలడంతో వారిపై వెంటనే చర్యలు తీసుకోవడం ప్రారంభించామన్నారు. ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన పోలీసు అధికారులకు నగదు రివార్డు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. పోలీస్‌శాఖలో లక్ష మందికి పైగా సిబ్బంది ఉన్నారని వీరి సంక్షేమం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని జ్ఞానేంద్ర వెల్లడించారు. ఇటీవల కొద్దికాలంగా పోలీసులు ప్రజలను వేధిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయని వీటిపై సీరియస్‌గా ఉన్నామని హొం మంత్రి చెప్పారు. శాంతి సామరస్యాలను కాపాడ్డంలో రాష్ట్ర పోలీసులు బాగా పనిచేస్తున్నారని ఆయన కితాబిచ్చారు.

Updated Date - 2022-01-21T17:09:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising