ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంటాడుతున్న మంకీపాక్స్‌ భయం

ABN, First Publish Date - 2022-06-09T17:03:35+05:30

ప్రపంచంలోని పలు దేశాల్లో మంకీపాక్స్‌ తీవ్రరూపం దాలుస్తున్న తరుణంలో రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో నిఘా పెంచుతున్నామని వైద్య ఆరోగ్యశాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                       - విమానాశ్రయాల్లో నిఘా: వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ 


బెంగళూరు, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోని పలు దేశాల్లో మంకీపాక్స్‌ తీవ్రరూపం దాలుస్తున్న తరుణంలో రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో నిఘా పెంచుతున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ తెలిపారు. బెంగళూరు, మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలతోపాటు డొమెస్టిక్‌ విమానాశ్రయాల్లోనూ పరీక్షలు కొనసాగిస్తామన్నారు. బెంగళూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు దేశాల్లో మంకీపాక్స్‌ ప్రబలుతోందన్నారు. ఈ అంశాన్ని సున్నితంగా పరిశీలిస్తున్నామన్నారు. మంకీపాక్స్‌ ఇప్పటి వరకు ఎవరికీ సోకలేదని, అటువంటి పరిస్థితి తలెత్తితే వెంటనే స్ర్కీనింగ్‌ జరుపుతామన్నారు. అన్ని జిల్లా ఆసుపత్రులు, మెడికల్‌ కళాశాలల అనుబంధమైన ఆసుపత్రులలో ప్రత్యేకమైన పడకలు ఏర్పాటు చేస్తామన్నారు. విమానాశ్రయాల్లో మంకీపాక్స్‌కు సంబంధించి నిరంతరంగా పరీక్షల విభాగం కొనసాగుతుందన్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక సర్క్యులర్‌ను విడుదల చేశారు. బెంగళూరులో మాస్క్‌ తప్పనిసరి చేస్తూ ఆదేశించామన్నారు.



Updated Date - 2022-06-09T17:03:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising