ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌ విద్యార్థుల కెరీర్‌ దెబ్బతినకుండా చూస్తాం

ABN, First Publish Date - 2022-03-09T17:50:32+05:30

యుద్ధంతో అట్టుడికిపోతున్న ఉక్రెయిన్‌ నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చిన వైద్యవిద్యార్థుల కెరీర్‌ దెబ్బతినకుండా ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ ఈ మేరకు శాసనసభ జీరో అవర్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                       - వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ 


బెంగళూరు: యుద్ధంతో అట్టుడికిపోతున్న ఉక్రెయిన్‌ నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చిన వైద్యవిద్యార్థుల కెరీర్‌ దెబ్బతినకుండా ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ ఈ మేరకు శాసనసభ జీరో అవర్‌లో మంగళవారం ఒక ప్రకటన చేశారు. కాంగ్రెస్‌ సభ్యుడు యూటీ ఖాదర్‌ లేవనెత్తిన అంశంపై ఆయన బదులిస్తూ ఉక్రెయిన్‌ వైద్య విద్యార్థుల కెరీర్‌కు భంగం ఏర్పడ కుండా చేపట్టాల్సిన చర్యలపై రాజీవ్‌గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌తోనూ, నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌తోనూ త్వరలోనే చర్చలు జరుపుతామన్నారు. ఉక్రెయిన్‌లో వైద్య కోర్సుల ప్రమాణాలకు, మనదేశ వైద్య కోర్సుల ప్రమాణాలకు చాలా తేడా ఉందని, అవసరమైతే విద్యార్థులకు అదనంగా తర్ఫీదు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలల్లో 50 శాతం మందిని, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మిగిలిన 50 శాతం మందికి వైద్యకోర్సులలో శిక్షణ ఇచ్చేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ కూడా కసరత్తు చేపట్టిందన్నారు. మనదేశానికి చెందిన 20వేల మంది వైద్య విద్యార్థులు ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చారని, వీరందరి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రధాని నరేంద్రమోదీ తగిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నారన్నారు. 

Updated Date - 2022-03-09T17:50:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising