ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చావులోనూ రాజకీయం

ABN, First Publish Date - 2022-04-15T17:00:55+05:30

మంత్రి ఈశ్వరప్ప వేధింపులకు బలై ఆత్మహత్య చేసుకున్న సంతోష్ పాటిల్‌ ముమ్మాటికీ బీజేపి కార్యకర్తనేనని ఆ పార్టీ బెళగావి జిల్లా నేతలు స్పష్టం చేస్తున్నారని కేపీసీసీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                    - బీజేపీపై కాంగ్రెస్‌ నేత రామలింగారెడ్డి మండిపాటు 


బెంగళూరు: మంత్రి ఈశ్వరప్ప వేధింపులకు బలై ఆత్మహత్య చేసుకున్న సంతోష్ పాటిల్‌ ముమ్మాటికీ బీజేపి కార్యకర్తనేనని ఆ పార్టీ బెళగావి జిల్లా నేతలు స్పష్టం చేస్తున్నారని కేపీసీసీ కార్యాధ్యక్షుడు ఆర్‌.రామలింగారెడ్డి పేర్కొన్నారు. సొంత పార్టీ కార్యకర్త చావులోనూ బీజేపీ దిక్కు మాలిన రాజకీయం చేస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. నగరంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ సంతోష్‌ పాటిల్‌ కాంగ్రెస్‌ కార్యకర్త అంటూ సోషల్‌ మీడియా ద్వారా బీజేపీ తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు. నిజాలు వెలుగు చూసిన తర్వాత ఆ నేతలు ఇప్పుడు కిక్కురు మనడం లేదన్నారు. సొంత పార్టీ కార్యకర్తల ప్రయోజనాలనే పరిరక్షించలేకపోయిన బీజేపీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎలా పరిరక్షించగలదని ఆయన ప్రశ్నించారు. సంతోష్‌ ఆత్మహత్యకు నేరుగా కారకుడైన మంత్రి ఈశ్వరప్పను కాపాడేందుకు సీఎం ప్రయత్నించారని అయితే పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేయడంతో ఆయన రాజీనామా చేయాల్సిన అనివార్యత ఏర్పడిందని రామలింగారెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఈశ్వరప్ప రాజీనామాతో అవినీతిపై కాంగ్రెస్‌ చేస్తున్న పోరాటాలకు తొలి విజయం లభించనుందన్నారు.

Updated Date - 2022-04-15T17:00:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising