ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP MLA కుమార్తె బీఎండబ్ల్యూ కారు నడుపుతూ సిగ్నల్ జంప్..ట్రాఫిక్ పోలీసులపై దురుసు ప్రవర్తన

ABN, First Publish Date - 2022-06-10T15:34:18+05:30

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కూతురు బీఎండబ్ల్యూ కారు నడుపుతూ ట్రాఫిక్ సిగ్నల్ ను జంప్ చేసి ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కూతురు బీఎండబ్ల్యూ కారు నడుపుతూ ట్రాఫిక్ సిగ్నల్ ను జంప్ చేసి ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఘటన బెంగళూరు నగరంలో గురువారం వెలుగుచూసింది.కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ నింబావలి కూతురు బీఎండబ్ల్యూ కారు నడుపుతూ సిగ్నల్ జంప్ చేసింది. ట్రాఫిక్ లైట్ ఎర్రగా మారడంతో ఆమె కారు ఆపలేదు.ఎమ్మెల్యే కుమార్తె బెంగళూరు పోలీసులతో పాటు స్థానిక జర్నలిస్టు, కెమెరాపర్సన్‌లతో కూడా అనుచితంగా ప్రవర్తించింది.ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ఎమ్మెల్యే కుమార్తె పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు ఆమెకు ఆధారాలు చూపి రూ.10 వేలు జరిమానా వసూలు చేశారు.‘‘నేను ఇప్పుడే వెళ్లాలనుకుంటున్నాను. 


కారు పట్టుకోవద్దు. ఓవర్‌టేక్ చేసినందుకు నాపై కేసు పెట్టకూడదు. ఇది ఎమ్మెల్యే వాహనం. నేను కారును ర్యాష్‌గా నడపలేదు. మా నాన్న అరవింద్ లింబావళి’’ అని ఎమ్మెల్యే కుమార్తె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. వెంటనే జరిమానా చెల్లించడానికి తన వద్ద డబ్బు లేదని ఆమె పేర్కొంది.కానీ చివరికి ఆమెతో పాటు ఉన్న స్నేహితుల్లో ఒకరు జరిమానా చెల్లించి వెళ్లి పోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Updated Date - 2022-06-10T15:34:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising