ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేరళలో భార్యల మార్పిడి రాకెట్‌

ABN, First Publish Date - 2022-01-11T09:57:02+05:30

కట్టుకున్న భార్యను తాళి కట్టినవాడే ఇతరులకు తార్చే ‘భార్యల మార్పిడి’ దందా గుట్టు కేరళలో బట్టబయలైంది! ‘మీటప్‌ కేరళ’.. ‘కపుల్‌ మీట్‌ కేరళ’.. ‘కకోల్డ్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 5000 జంటలు అందులో ఉన్నట్టు వెలుగులోకి

కొట్టాయం, జనవరి 10: కట్టుకున్న భార్యను తాళి కట్టినవాడే ఇతరులకు తార్చే ‘భార్యల మార్పిడి’ దందా గుట్టు కేరళలో బట్టబయలైంది! ‘మీటప్‌ కేరళ’.. ‘కపుల్‌ మీట్‌ కేరళ’.. ‘కకోల్డ్‌ కేరళ’.. తదితర పేర్లతో వాట్సాప్‌, టెలిగ్రామ్‌, మెసెంజర్లలో పెద్ద సంఖ్యలో గ్రూపులు ఏర్పాటు చేసుకుని మరీ వారు కొనసాగిస్తున్న దారుణం ఒక మహిళ (26) ఫిర్యాదుతో బయటపడింది. కొట్టాయం జిల్లా పథనాడ్‌కు చెందిన ఆ మహిళ నిస్సహాయ స్థితిలో గత శనివారం మధ్యాహ్నం (జనవరి 8న) పోలీసులను ఆశ్రయించింది. తన భర్తే (32) తనను పరాయి పురుషులతో శృంగారంలో, అసహజ లైంగిక చర్యల్లో పాల్గొనమంటున్నాడంటూ వాపోయింది. భర్త సహకారంతో తనపై తొమ్మిది మంది అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. తనపై అత్యాచారానికి పాల్పడిన తొమ్మిది మందిలో ఐదుగురు తమ భార్యలతో వచ్చారని.. మిగతా నలుగురూ భార్యలను తీసుకురాలేదని వెల్లడించింది. తాను చెప్పినట్టు చేయకపోయినా, ఈ విషయం ఎవరికైనా చెప్పినా.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడని చెప్పింది. రెండేళ్లుగా ఈ నరకాన్ని భరిస్తున్నానని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులుఆమె చెప్పిన వివరాల ఆధారంగా.. దర్యాప్తునకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. సైబర్‌ సెల్‌ పోలీసుల నేతృత్వంలో దర్యాప్తు కొనసాగించి.. కేరళలోని వివిధ జిల్లాల్లో ఉంటున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. బాధితురాలి భర్తనూ అదుపులోకి తీసుకున్నారు. 5000 జంటలు ఈ రాకెట్‌లో ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకివచ్చింది. కేరళలో ఉన్నత వర్గాలకు చెందిన పలువురు వ్యక్తులు, వీఐపీలు కూడా ఈ చీకటిదందాలో ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో మరిన్ని అరెస్టులుంటాయని పోలీసులు చెప్పారు.

Updated Date - 2022-01-11T09:57:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising