ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Koo: ‘కూ’లో స్వాతంత్ర్య దినోత్సవ రిజల్యూషన్ ప్రచారాన్ని ప్రారంభించిన కరణ్ జోహార్

ABN, First Publish Date - 2022-08-02T21:47:24+05:30

స్వాతంత్ర్య దినోత్సవ తీర్మానాన్ని ఆమోదించేలా ఖాతాదారులను ప్రోత్సహించేందుకు స్వదేశీ మైక్రోబ్లాగింగ్ యాప్ కూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: స్వాతంత్ర్య దినోత్సవ తీర్మానాన్ని ఆమోదించేలా ఖాతాదారులను ప్రోత్సహించేందుకు స్వదేశీ మైక్రోబ్లాగింగ్ యాప్ కూ (Koo) అద్భుతమైన ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ‘కూ’లో #NayeBharatKaSapna ప్రచారాన్ని ప్రారంభించాడు. ఇది స్థానిక మనోభావాలను రేకెత్తిస్తుంది. భారత పునర్నిర్మాణం కోసం సమష్టిగా మార్పును తీసుకురావడంలో ఒక కొత్త తీర్మానాన్ని స్వీకరించేందుకు ఇది వినియోగదారులను ప్రేరేపిస్తుంది. ఉత్పత్తుల రీసైక్లింగ్,  పునర్వినియోగం వంటి అలవాట్లను అవలంబించడం ద్వారా వాతావరణ మార్పుల సమస్యపై పోరాడతామని ప్రతిజ్ఞ చేయడం ద్వారా కరణ్ జోహార్ ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ఆగస్టు 1న ప్రారంభమైన ఈ ప్రచారం 15 రోజులపాటు కొనసాగుతుంది. సమాజ సంక్షేమం కోసం ప్రతిరోజూ కృషి చేసే వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలతో సహా భారతదేశ సాయుధ దళాలు, కొవిడ్ యోధులకు సెల్యూట్ చేయమని ప్రజలను ఇది ప్రోత్సహిస్తుంది.


కూ యాప్ తాజ ప్రచారంపై దాని చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సునీల్ కామత్ మాట్లాడుతూ.. #NayeBharatKaSapna ప్రగతిశీల అలవాట్లను అలవర్చుకునేలా ప్రజలను ప్రేరేపించడం ద్వారా భావవ్యక్తీకరణ కు సంబంధించి కొత్త ప్రయాణానికి దారి తీస్తుందని అన్నారు. కరణ్ జోహార్ ఈ ప్రచారాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. #FightClimateChangeపై తన నిబద్ధత గురించి కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ఈ వాతావరణ మార్పుల పోరాటంలో ప్రతి ఒక్కరికీ పాత్ర ఉందన్నారు. #NayeBharatKaSapnaలో తాను పాల్గొన్నందుకు ఆనందంగా ఉందన్నారు. 

Updated Date - 2022-08-02T21:47:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising