ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిబాల్‌కు ABCలు కూడా తెలియవు: సీఎం గెహ్లాట్

ABN, First Publish Date - 2022-03-16T01:17:23+05:30

గాంధీల కుటుంబం కాంగ్రెస్ నాయకత్వం నుంచి వైదొలగాలని, 'ఘర్ కా కాంగ్రెస్' కాకుండా 'సబ్ కా కాంగ్రెస్' కావాలని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గాంధీల కుటుంబం కాంగ్రెస్ నాయకత్వం నుంచి వైదొలగాలని, 'ఘర్ కా కాంగ్రెస్' కాకుండా 'సబ్ కా కాంగ్రెస్' కావాలని ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యలపై దుమారం ఆగడం లేదు. ఆ పార్టీ సహచరులే ఒక్కొక్కరుగా సిబాల్‌పై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ఆ జాబితాలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా చేరారు. సిబాల్ వ్యాఖ్యలను ఆయన మంగళవారంనాడు ఘాటుగా తిప్పికొట్టారు. ఆయనకు కాంగ్రెస్ గురించి ఏబీసీలు కూడా తెలియవని ఎద్దేవా చేశారు.


''కపిల్ సిబల్ కాంగ్రెస్ సంస్కృతిని చెందిన వ్యక్తి కాదు. రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖ న్యాయవాది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఆయనకు చాలా అవకాశాలు ఇచ్చారు. కాంగ్రెస్ గురించి ఏబీసీలు కూడా తెలియని వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని కూడా ఊహించం'' అని గెహ్లాట్ అన్నారు. ఇప్పటికే కపిల్ సిబాల్ వ్యాఖ్యలను లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ విప్ మాణిక్యం ఠాకూర్ ఖండించారు. కృతజ్ఞత లేని వ్యక్తి కపిల్ అని, ఆర్ఎస్ఎస్, బీజేపీ భాషలో ఆయన మాట్లాడుతున్నారని వారు తూర్పారబట్టారు.

Updated Date - 2022-03-16T01:17:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising