ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kanwar yatra: నంది బైక్‌పై వారణాసి చుట్టేస్తున్న శివుడు

ABN, First Publish Date - 2022-07-26T23:43:18+05:30

భక్తికి కొలమానాలు, భక్తుల ఆనందానికి అవధులు ఉండవంటారు. పండుగ సీజన్‌లో భక్తుల ఉత్సాహానికి పట్టపగ్గాలుండవు. శివభక్తులైన ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారణాసి: భక్తికి కొలమానాలు, భక్తుల ఆనందానికి అవధులు ఉండవంటారు. పండుగ సీజన్‌లో భక్తుల ఉత్సాహానికి పట్టపగ్గాలుండవు. శివభక్తులైన కన్వరీలు పవిత్ర గంగాజలాలను సేకరిస్తూ సందడి చేస్తుండగా, వారణాసికి చెందిన ఓ యువకుడు నేరుగా శివుడి వేషం కట్టి, తన మోటార్ బైక్‌ను శివుడు వాహనమైన నందిగా అలంకరించి రోడ్లపై దూసుకుపోతున్నాడు. ఈ వింత చూడడానికి జనం ఎగబడుతున్నారు. అతను ఆగినప్పుడల్లా జనం చుట్టూ చేరి సెల్ఫీలు దిగుతూ, వీడియోలు తీసుకుంటూ కేరంతలు కొడుతున్నాయి. కన్వరీలు సైతం ఆ యువకుడి వైపు ఆసక్తిగా చూస్తూ మురిసిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.


బొందిలో ప్రాణాలు ఉన్నంతవరకూ మానను...

నంది బైక్‌పై వారణాసి వీధులు చుట్టేస్తూ అందర్నీ ఇట్టే కట్టిపడేస్తున్న ఆ యువకుడి పేరు సునీల్ గుప్తా. వారణాసిలోని రూరల్ ఏరియా అనిల్ బజార్ నివాసి. చిన్న పచారీ దుకాణం, పాన్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఏటా శివుడి వేషంలో బాబా విశ్వనాథ్ టెంపుల్‌‌‌కు వస్తున్నానని, తాను బతికున్నంత కాలం ఇలాగే కొనసాగిస్తానని చెప్పాడు. బైక్‌ను నందిరూపంలో అలంకరించేందుకు అతను రూ.15,000 ఖర్చు చేశాడు. నంది బైక్‌పై దశాశ్వమేథ్ ఘాట్ (Dashashwamedh Ghat) చేరుకుని గంగా జలాన్ని సేకరంచిన అనంతరం అతను అక్కడి పెట్రోల్ పంప్‌ వద్ద ఆగాడు. అతని వేషధారణ చూసి బంక్ సిబ్బంది తొలుత వింతగా చూసినా, ఆ  వెంటనే చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీల దిగేందుకు పోటీపడ్డారు. వీడియోలు తీసుకున్నారు.


శివుడిని ఆరాధించే కన్వరీలకు (Kanwariyas) శ్రావణ మాసం చాలా ప్రత్యేకం. పవిత్ర క్షేత్రాల్లో గంగా నదీ జలాలను సేకరించి తమ స్వగ్రామాలకు తీసుకువెళ్తారు. అక్కడి శివాలయాల్లో అభిషేకలు చేసి తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. గణేష్ చతుర్ధి, రక్షాబంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి వరుస పండుగలకు కూడా ఇదే సీజన్‌ కావడంతో భక్తుల్లో ఉత్సాహం ఇనుమడిస్తుంటుంది.

Updated Date - 2022-07-26T23:43:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising