ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నియాకుమారిలో రెండో రోజూ అలజడి

ABN, First Publish Date - 2022-01-05T16:38:12+05:30

ప్రముఖ పర్యాటక ప్రాంతం కన్నియా కుమారి సముద్రతీరంలో రెండో రోజూ అలల ఉదృతి అధికమై పెను గాలులు వీచాయి. దీంతో వివేకానంద స్మారక మంటపం,, తిరువళ్లువర్‌ విగ్రహం ప్రాంతానికి బోట్‌ సఫారీని రద్దు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బోట్‌ సఫారీల రద్దు

- కన్నియాకుమారి తీరం వద్ద నిలిపి ఉంచిన పూంపుహార్‌ షిప్పింగ్‌ కార్పొరేషన్‌ సంస్థ బోట్లు


చెన్నై: ప్రముఖ పర్యాటక ప్రాంతం కన్నియా కుమారి సముద్రతీరంలో రెండో రోజూ అలల ఉదృతి అధికమై పెను గాలులు వీచాయి. దీంతో వివేకానంద స్మారక మంటపం,, తిరువళ్లువర్‌ విగ్రహం ప్రాంతానికి బోట్‌ సఫారీని రద్దు చేశారు. దీంతో ఆ రెండు ప్రాంతాలను సందర్శించేందుకు విచ్చేసిన పర్యాటకులు తీవ్ర నిరాశకు గురయ్యారు.. గత రెండు రోజులుగా సముద్రతీరంలో 10 నుంచి 15 అడుగుల ఎత్తున అలలు తీరం వైపు ఎగసిపడుతున్నాయి. దీంతో సముద్రంలో స్నానం చేయడానికి వెళ్ళిన వారంతా భయంతో పరుగులు తీశారు. కొంతమంది యువకులు అలల ఉదృతిని పట్టించుకోకుండా స్నానం చేసేందుకు వెళ్ళారు. గస్తీ తిరుగుతున్న పోలీసులు వారిని తరిమకొట్టారు. సముద్రంలో అలల ఉదృతి అధికంగా ఉండటంతో కన్నియాకుమారి జాలర్లు కూడా చేపలవేట మానుకున్నారు. దీంతో తీరం వద్ద జాలర్ల పడవలు, పూంపుహార్‌ షిప్పింగ్‌ కార్పొరేషన్‌ సంస్థకు చెందిన బోట్లను నిలిపి ఉంచారు.

Updated Date - 2022-01-05T16:38:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising