ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నియాకుమారిలో మళ్లీ వెనక్కి మళ్లిన సముద్రం

ABN, First Publish Date - 2022-06-03T13:18:34+05:30

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కన్నియాకుమారిలో ఐదోరోజు కూడా సముద్రం వెనక్కి మళ్ళింది. దీంతో తీరం వెంబడి వందడుగుల వరకూ సముద్రం వెనక్కి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కన్నియాకుమారిలో ఐదోరోజు కూడా సముద్రం వెనక్కి మళ్ళింది. దీంతో తీరం వెంబడి వందడుగుల వరకూ సముద్రం వెనక్కి మళ్ళటంతో పర్యాటకులు దిగ్ర్భాంతి చెందారు. కన్నియాకుమారిలో ప్రతిరోజూ సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని తిలకించేందుకు వివేకానంద స్మారక మండపం, తిరువళ్ళువర్‌ విగ్రహ ప్రాంతాన్ని సందర్శించేందుకు వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. గత నాలుగు రోజులుగా సముద్రం వెనక్కి మళ్ళుతుండటంతో వివేకానంద స్మారక మండపానికి, తిరువళ్లువర్‌ విగ్రహ ప్రాంతానికి బోట్‌ సఫారీని ఆలస్యంగా ప్రారంభిస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటల సమయంలో  బోట్‌ సఫారీ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే నాలుగు రోజులుగా ఉదయం సముద్రం వెనక్కి మళ్ళుతుండటంతో బోట్‌సఫారీని ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తున్నారు. ఆ సమయంలో ఎండ అధికంగా ఉండటంతో పర్యాటకులు పడవలపై వెళ్లేందుకు జంకుతున్నారు. ఇదే విధంగా గురువారం ఉదయం కూడా సముద్రం సుమారు వందడుగుల వరకు వెనక్కి మళ్ళింది. తీరంలోని బండరాళ్లు, నాచు బయటపడ్డాయి. ఉదయం 11 గంటలకు సముద్రం మళ్ళీ యథాస్థితికి రావటంతో బోట్‌సఫారీని ప్రారంభించారు.

Updated Date - 2022-06-03T13:18:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising