ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్య ప్రదేశ్ సీఎల్‌పీ నేత పదవికి కమల్‌నాథ్ రాజీనామా

ABN, First Publish Date - 2022-04-28T23:07:08+05:30

మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ : మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ మధ్య ప్రదేశ్ శాసన సభలో ఆ పార్టీ శాసన సభా పక్ష నేత పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదించినట్లు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ లేఖలో తెలిపారు. నూతన ప్రతిపక్ష నేతగా డాక్టర్ గోవింద్ సింగ్‌ను నియమించినట్లు తెలిపారు. 


వేణుగోపాల్ గురువారం కమల్‌నాథ్‌కు రాసిన లేఖలో, మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత పదవికి కమల్‌నాథ్ చేసిన రాజీనామాను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదించినట్లు తెలిపారు. సీఎల్‌పీ నేతగా ఆయన అందించిన సేవలను హృదయపూర్వకంగా ప్రశంసిస్తున్నట్లు తెలిపారు. నూతన సీఎల్‌పీ నేతగా డాక్టర్ గోవింద్ సింగ్‌ను నియమించేందుకు సోనియా ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత గోవింద్ సింగ్ మధ్య ప్రదేశ్‌లోని లహర్ నియోజకవర్గం నుంచి శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 


2018లో జరిగిన మధ్య ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో కమల్‌నాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 15 నెలలపాటు ఆయన ఆ పదవిని నిర్వహించారు. కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆయన ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత పదవిని 2020 జూలైలో కమల్‌నాథ్ చేపట్టారు. 


Updated Date - 2022-04-28T23:07:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising