ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటింటికీ శుభ్రమైన తాగునీరు

ABN, First Publish Date - 2022-02-10T13:35:44+05:30

మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు, సినీ నటుడు కమల్‌హాసన్‌ మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పలు హామీలను ప్రకటించారు. బుధవారం పార్టీ అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మాట్లాడుతూ ఓటర్లపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ప్రతినెలా వార్డు కమిటీ సభలు 

- అన్ని చోట్లా వాననీటి కాల్వలు

- కమల్‌ ఎన్నికల హామీలు


చెన్నై: మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు, సినీ నటుడు కమల్‌హాసన్‌ మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పలు హామీలను ప్రకటించారు. బుధవారం పార్టీ అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మాట్లాడుతూ ఓటర్లపై హామీల వర్షం కురిపించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇంటింటికీ పరిశుభ్రమైన తాగునీటిని నిరంత రాయంగా సరఫరా చేస్తామని గాలి నుంచి నీటిని తయారు చేసే సాంకేతిక పద్ధతులను ప్రవేశపెడతామని ప్రకటించారు. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణ పంచాయతీల్లో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి గ్రామసభల రీతిలో ప్రతినెలా వార్డు కమిటీ సభలను ఏర్పాటు చేస్తామని, ప్రతి వార్డులోనూ నాణ్యమైన రోడ్లను నిర్మిస్తామని, ప్రతి కాలనీలో వాననీటి కాల్వలను నిర్మిస్తామని, ఉద్యానవనాలు, వ్యాయామశాలలు ఏర్పాటు చేస్తామని, సమాచార సాంకేతిక పద్ధతుల్లో ఆయా వార్డుల్లోని ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి వీధిలోనూ చెత్త సేకరించేందుకు వ్యర్థాలను నిల్వచేసే తొట్టెలను నిర్మిస్తామని, అందులో వేసే చెత్తను రీసైక్లింగ్‌ చేస్తామన్నారు. ఇంటి, ఆస్తిపన్నుల సక్రమంగా వసూలు చేసి ప్రజలకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. చెరువులు, వాగులు, వంకలు ఆక్రమణకు గురికాకుండా అడ్డుకట్ట వేస్తామని, నీటి వనరులను పెంచుతామని ఆయన తన హామీల్లో పేర్కొన్నారు. మొత్తానికి అవినీతికి తావులేని పారదర్శకమైన పాలనను అందిస్తామని కమల్‌హాసన్‌ శపథం చేశారు.

Updated Date - 2022-02-10T13:35:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising