ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5న కలబురగి మేయర్‌ ఎన్నిక

ABN, First Publish Date - 2022-01-29T16:01:36+05:30

కలబురగి మహానగర పాలికె మేయర్‌, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక ఫిబ్రవరి 5న జరిగేలా ముహూర్తం ఖరారైంది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ల స్థానాలకు రిజర్వేషన్‌ మార్పు జరిగిన మేరకు ప్రాంతీయ కమిషనర్‌ ఎన్నికలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కలబురగి మహానగర పాలికె మేయర్‌, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక ఫిబ్రవరి 5న జరిగేలా ముహూర్తం ఖరారైంది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ల స్థానాలకు రిజర్వేషన్‌ మార్పు జరిగిన మేరకు ప్రాంతీయ కమిషనర్‌ ఎన్నికలు జరిగేలా గెజిట్‌ నోటిఫికేషన్‌ను శుక్రవారం జారీ చేశారు. 5న ఉదయం 10.30గంటలకు నామినేషన్‌ల దాఖలుకు గడువు ఉండగా మధ్యాహ్నం 12గంటలకు ఓటింగ్‌ జరుగనుందని కలబురగి ప్రాంతీయ కమిషనర్‌ ఎన్‌వీ ప్రసాద్‌ వెల్లడించారు. మేయర్‌ స్థానాన్ని ఎస్సీకి, ఉపమేయర్‌ స్థానాన్ని జనరల్‌ కేటగిరీకి కేటాయించారు. మొత్తం 55 వార్డులు ఉండగా కాంగ్రెస్‌కు 27, బీజేపీ 24, జేడీఎస్‌ 4 స్థానాలలో సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు అధికారం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఎవరు అధికారంలోకి రావాలన్నా జేడీఎస్‌ మద్దతు అనివార్యమైంది. స్థానిక కాంగ్రెస్‌ నేతలు జేడీఎస్‌ మద్దతు కోరుతుండగా, బీజేపీ వ్యూహాత్మకంగా ఎమ్మెల్సీలు లక్ష్మణ్‌ సవది, తుళసి మునిరాజ్‌గౌడ, ప్రతాప్‌సింహనాయక్‌, లెహర్‌సింగ్‌, భారతిశెట్టి, డాక్టర్‌ సాబణ్ణ తళవార, రఘునాథరావు మల్కాపురల పేర్లను ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా చేర్చింది. వారిలో ఎవరు స్థానికులు కాకపోవడంపై కాంగ్రెస్‌ అభ్యంతరం తెలుపుతోంది. 

Updated Date - 2022-01-29T16:01:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising