ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shivakumar's statement: సిద్దరామయ్య అందరివాడు

ABN, First Publish Date - 2022-08-04T18:00:52+05:30

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత సిద్దరామయ్య(Former Chief Minister and Leader of Opposition Siddaramaiah)ను కేవలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                    - డీకే శివకుమార్‌ ప్రశంసలు 


బెంగళూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత సిద్దరామయ్య(Former Chief Minister and Leader of Opposition Siddaramaiah)ను కేవలం ‘అహింద’ నేతగా పేర్కొనడం సరికాదని ఆయన అందరివాడని కేపీసీసీ(KPCC) అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ప్రశంసలతో ముంచెత్తారు. దావణగెరెలో బుధవారం ఏర్పాటు చేసిన సిద్దరామోత్సవ ర్యాలీని ఉద్దేశించి డీకే శివకుమార్‌ ప్రసంగిస్తూ పీకల్లోతు అవినీతిలో కూరుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సహా పెకలించివేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‏ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడం ద్వారా కేంద్రంలో రాహుల్‌గాంధీని ప్రధాని చేద్దామంటూ కార్యకర్తల్లో ఉత్తేజం నింపారు. సిద్దరామయ్య మార్గదర్శకంలో ముందుకు సాగుతూ సమష్టి నాయకత్వంలో 2023 శాసనసభ ఎన్నికల్లో సరికొత్త చరిత్రను లిఖిద్దామన్నారు. సిద్దరామయ్య కేవలం బలహీనవర్గాలు, దళితులు, మైనార్టీ(Minority)లకే కాకుండా అన్నివర్గాల ప్రజలు అమితంగా ఇష్టపడే గొప్పనేత అన్నారు. రాష్ట్రంలో యువతకు, రైతులకు, నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. కాంగ్రెస్‌ మళ్లీ విధానసౌధ మూడో అంతస్థులోకి అధికారంతో అడుగుపెడితేనే రాష్ట్ర ప్రజలకు అన్ని సమస్యలనుంచి విముక్తి లభిస్తుందన్నారు. రాజకీయాలను ప్రజాస్వామ్య వ్యవస్థను, దర్యాప్తు సంస్థలను గతంలో ఎన్నడూలేని విధంగా భ్రష్టు పట్టిస్టున్న బీజేపీకి రాష్ట్ర ప్రజలు చెక్‌ పెట్టే సమయం ఆసన్నమైందన్నారు. డీకే శివకుమార్‌ తన ప్రసంగంలో సిద్దరామయ్యను ప్రశంసించినప్పుడల్లా సభలో కరతాళ ధ్వనులు మిన్నంటాయి. 

Updated Date - 2022-08-04T18:00:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising