ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shivakumar Comments: ఆ మాజీమంత్రికి క్లీన్‌చిట్‌పై పోరాడుతాం

ABN, First Publish Date - 2022-07-26T17:39:46+05:30

కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్య కేసులో మాజీ మంత్రి ఈశ్వరప్పకు క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై పోరాటం చేస్తామని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్య కేసులో మాజీ మంత్రి ఈశ్వరప్ప(Eshwarappa)కు క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై పోరాటం చేస్తామని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తెలిపారు. బెంగళూరు(Bengaluru)లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్టర్‌ ఆత్మహత్య కేసులో మాజీ మంత్రికి సంబంధం లేదనే రీతిలో పోలీసులు కోర్టుకు సమర్పించిన బి-రిపోర్టుపై పార్టీకి చెందిన సీనియర్‌ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో తీవ్ర పోరాటానికి వెనుకాడేది లేదన్నారు. బీజేపీ(Bjp) ప్రభుత్వం ఈ కేసును దారి తప్పించేందుకు గతంలోనే ప్రయత్నించిందన్నారు. ప్రభుత్వంలో భారీ అవినీతి జరిగిందనేందుకు కాంట్రాక్టర్‌ సంతోష్‏పాటిల్‌ ఆరోపణలే నిదర్శనమన్నారు. మాజీ స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి విసిరిన సవాలును తాము స్వీకరిస్తామన్నారు. మాజీ సీఎం యడియూరప్ప(Former CM Yeddyurappa), సీఎం బొమ్మై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కటీల్‌ లేదా సీటీ రవిలో ఎవరో ఒకరితో చర్చకు సిద్ధమన్నారు. 

Updated Date - 2022-07-26T17:39:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising