ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌ పదవులు అనవసరం

ABN, First Publish Date - 2022-04-25T14:01:06+05:30

దేశంలో గవర్నర్‌ పదవులు అనవసరమైనవని మద్రాస్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రూ అభిప్రాయపడ్డారు. చెన్నైలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జస్టిస్‌ చంద్రూ ఘాటు వ్యాఖ్యలు

చెన్నై, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): దేశంలో గవర్నర్‌ పదవులు అనవసరమైనవని మద్రాస్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రూ అభిప్రాయపడ్డారు. చెన్నైలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తమిళనాట ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభలో రూపొందించిన ముసాయిదా బిల్లులపై గవర్నర్‌ 3 నెలలు గడిచినా ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఇలాంటి పరిస్థితుల్లో దేశం లో గవర్నర్లు అవసరమా? ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదా? అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్లు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా, తాము అనుకున్నట్టుగానే ఫాసిస్ట్‌ ధోరణులతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. న్యాయశాస్త్రం చదివే విద్యార్థులు, అధ్యాపకులు కోర్టు తీర్పులను విమర్శించాలన్నారు. అపుడే ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందని  జస్టిస్‌ చంద్రూ పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-25T14:01:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising