ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1 నుంచి విద్యుత్ చార్జీల మోత

ABN, First Publish Date - 2022-06-29T16:32:45+05:30

పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో అట్టుడికిపోతున్న ప్ర జలపై మరో పెనుభారం పడబోతున్నది. జూలై 1

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కేఈఆర్‌సీకి కంపెనీల ప్రతిపాదన

- యూనిట్‌కు 38 నుంచి 55 పైసల వరకు భారం


బెంగళూరు, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో అట్టుడికిపోతున్న ప్ర జలపై మరో పెనుభారం పడబోతున్నది. జూలై 1 నుంచి విద్యుత్‌ చార్జీల షాక్‌ తగలనుంది. థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుల నిర్వహణ పెనుభారమై ఉత్పాదనా ఖర్చు పెరగడం, పలు విద్యుత్‌ కంపెనీలు నష్టాలబాటలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలోనే ప్రతి యూనిట్‌కు 38 పైసలనుంచి 55 పైసలకు పెంచేందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్టు విద్యుత్‌శాఖ అధికారులను ఉటంకిస్తూ తెలిసింది. ఈలెక్కన ప్రతినెలా వంద యూనిట్‌ల విద్యుత్‌ను వినియోగించేవారి పై అదనంగా రూ.19 నుంచి 31 రూపాయల భారం పడనున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (కేఈఆర్‌సీ)కు ధరల పెంపు ప్రతిపాదనలు మొత్తం ఐదు విద్యుత్‌ కంపెనీలు ఇప్పటికే సమర్పించాయి. వీటిలో బెస్కాం అత్యధికంగా ప్రతిపాదించగా హెస్కాం రెండోస్థానంలోనూ, గెస్కాం మూడోస్థానంలోనూ, మెస్కాం నాల్గవస్థానంలోనూ, నెస్కాం చివరిస్థానంలోనూ ఉన్నాయి. విద్యుత్‌చార్జీల పెంపునకు సంబంధించి అంతిమంగా ప్రభుత్వ ఆమోదం కోసం ఈ సంస్థలు ఎదురుచూస్తున్నాయి. జూలై 1నుంచి కొత్త చార్జీలు అమలులోకి వస్తాయని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై అందరి చూపు ఉంది.

Updated Date - 2022-06-29T16:32:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising