ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mohammed Zubair అరెస్ట్‌పై ఐక్యరాజ్యసమితి స్పందన.. ఏమన్నదంటే..

ABN, First Publish Date - 2022-06-29T15:27:03+05:30

జర్నలిస్ట్‌, ప్యాక్ట్‌చెకింగ్‌ వెబ్‌సైట్‌ ఆల్ట్‌న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ జుబైర్‌(Mohammed Zubair) అరెస్ట్ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి(UNO) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. వార్త రాసినందుకు, ట్వీట్ చేసినందుకు లేదా ఏదైనా విషయం వెల్లడించిన కారణంగా జర్నలిస్టుల(Journalists)ను జైలుపాలు చేయడం తగదని ఐరాస చీఫ్ అంటోనియో గుటెర్రస్(Antonio Guterres) ప్రతినిధి స్టెఫానీ డుజారిక్ (Stephane Dujarric)వ్యాఖ్యానించారు. వేధింపుల భయం లేకుండా జర్నలిస్టులు స్వేచ్ఛగా విషయాలను చెప్పగలగడం చాలా ముఖ్యమన్నారు. తన గది సహా ప్రపంచంలో ఎక్కడైనా జర్నలిస్టులు వెళ్లగలగాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్ : జర్నలిస్ట్‌, ప్యాక్ట్‌చెకింగ్‌ వెబ్‌సైట్‌ ఆల్ట్‌న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ జుబైర్‌(Mohammed Zubair) అరెస్ట్ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి(UNO) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. వార్త రాసినందుకు, ట్వీట్ చేసినందుకు లేదా ఏదైనా విషయం వెల్లడించిన కారణంగా జర్నలిస్టుల(Journalists)ను జైలుపాలు చేయడం తగదని ఐరాస చీఫ్ అంటోనియో గుటెర్రస్(Antonio Guterres) ప్రతినిధి స్టెఫానీ డుజారిక్ (Stephane Dujarric)వ్యాఖ్యానించారు. వేధింపుల భయం లేకుండా జర్నలిస్టులు స్వేచ్ఛగా విషయాలను చెప్పగలగడం చాలా ముఖ్యమన్నారు. తన గది సహా ప్రపంచంలో ఎక్కడైనా జర్నలిస్టులు వెళ్లగలగాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఎక్కడైనా జనాలు స్వేచ్ఛగా మాట్లాడగలగాలి. ముఖ్యంగా జర్నలిస్టులు ఎలాంటి భయంలేకుండా పనిచేయడం అవశ్యమని స్టెఫానీ డుజారిక్ సూచించారు. రోజువారీ వార్తలు వెల్లడిస్తున్న సమయంలో జుబైర్ అరెస్ట్‌పై ఓ పాకిస్తానీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు స్టెఫానీ పైవిధంగా స్పందించారు. కాగా మహమ్మద్‌ జుబైర్‌‌ని ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసింది. 2018లో అతడు చేసిన ట్వీట్లు ఓ మత విశ్వాసాలను అవమానించేవిగా ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.  


నాలుగు రోజులపాటు కస్టడీ..

మహమ్మద్‌ జుబైర్‌కు ఢిల్లీ కోర్టు నాలుగు రోజుల కస్టడీని మంజూరు చేసింది. ఒక వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా 2018లో ట్వీట్‌ చేశారన్న ఆరోపణలపై  పోలీసులు ఆయనను సోమవారం అరెస్టు చేశారు. స్థానిక మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ స్నిగ్థ సవారియా ఎదుట ఆయనను మంగళవారం హాజరుపరిచారు. విచారణ సందర్భంగా.. జుబైర్‌ను ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా.. నాలుగు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది

Updated Date - 2022-06-29T15:27:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising