ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Journalist arrested: విద్యార్థినిపై అత్యాచారం ఆరోపణలు.. జర్నలిస్ట్ అరెస్ట్

ABN, First Publish Date - 2022-10-02T01:40:53+05:30

యువతిపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: యువతిపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లోని అనంతనాగ్ జిల్లాలోని కజీబాగ్‌కు చెందిన జర్నలిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జర్నలిస్టుగా తనను తాను చెప్పుకునే నదీమ్ అహ్మద్ గనీ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.


తాను జర్నలిస్టునని, ఎవరైనా తన సాయం కావాలంటే సంప్రదించవచ్చంటూ ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిని అయిన బాధిత యువతికి ఈ గ్రూపు ద్వారా వల వేశాడు. పరిచయమైన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.


ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియాలో తీసి ఆపై బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. వాటిని చూపించి బెదిరించి పలుమార్లు డబ్బులు దండుకున్నాడు. అంతేకాదు, తన నుంచి పలుమార్లు బంగారు నగలు కూడా తీసుకున్నట్టు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నదీమ్‌ను అరెస్ట్ చేశారు.  

Updated Date - 2022-10-02T01:40:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising