ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా జోడు రథోత్సవం

ABN, First Publish Date - 2022-03-08T17:23:45+05:30

కర్ణాటక, ఆంధ్ర చివరి భాగాల్లో ఉన్న వేదావతి నది ఒడ్డున వెలసిన బసరకోడు, గూళ్యం గ్రామాల సిద్దేశ్వర, గాదిలింగేశ్వరస్వాముల జోడు రథోత్సంగూళ్యం గ్రామంలో కన్నుల పండువగా జరిగింది. సోమవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంప్లి(బెంగళూరు): కర్ణాటక, ఆంధ్ర చివరి భాగాల్లో ఉన్న వేదావతి నది ఒడ్డున వెలసిన బసరకోడు, గూళ్యం గ్రామాల సిద్దేశ్వర, గాదిలింగేశ్వరస్వాముల జోడు రథోత్సంగూళ్యం గ్రామంలో కన్నుల పండువగా జరిగింది. సోమవారం ఉదయం సిద్దేశ్వరస్వామి, గాదిలింగప్ప తాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ యేడాది కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల భక్తులు భారీఎత్తున తరలివచ్చారు. గూళ్యం గ్రామానికి చేరుకోవాలంటే గతంలో మోకా మీదుగా వెళ్లి తిరిగి రావాల్సిన ఉండేది. భక్తు లు కొంతమేర ఇబ్బందులు పడేవారు. కానీ ఈ యేడాది రథోత్సవాన్ని దృష్టిలో వుంచుకుని కరచేడు, బసరకోడు, హిరే అడలిగి, గూళ్యం, బాపురం, తదితర గ్రామాల ప్రజలు, రైతన్నలు ముందుకొచ్చి తామే వేదావతి నదిపై సొంతంగా తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు. పూర్తిగా దగ్గర కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, పోలీసులు, గ్రామ పంచాయతీ సభ్యులు గట్టి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో గుమ్మనూరు సోదరులు శ్రీనివాస్‌, నారాయణస్వామి, ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ కోట్ల సుజాతమ్మ, టీడీపీ నాయకుడు వైకుంఠం శివప్రసాద్‌, పారిశ్రామికవేత్త జ్యోతి, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు గాదిలింగ, డీఎస్పీ వినోద్‌ కుమార్‌, సీఐ ఈశ్వరప్ప, ఎస్‌ఐ సురేష్‌, స్థానిక బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-08T17:23:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising