ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Terror Funding: హిజ్బుల్ చీఫ్ కుమారుడు సహా నలుగురు ఉద్యోగుల తొలగింపు

ABN, First Publish Date - 2022-08-13T20:12:02+05:30

ఉగ్రవాదులకు నిధుల సమకూర్చిన కేసులో జమ్మూకశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం కొరడా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: ఉగ్రవాదులకు నిధుల సమకూర్చిన కేసులో జమ్మూకశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం కొరడా ఝళిపించింది. నలుగురు ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించింది. వీరిలో టెర్రర్ ఫండింగ్ నిందితుడు బిట్టా కరాటే భార్య అస్సాబా అర్జూమండ్ ఖాన్ ఒకరు. జేకేఎల్ఎఫ్ టాప్ టెర్రరిస్టులో ఒరైన ఫరూఖ్ అహ్మద్ డర్ అలియాస్ బిట్టాకరాటే 2011 బ్యాచ్ జేకేఏఎస్ ఆఫీసర్. కాగా, ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగించిన వారిలో నిషేధిత హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సైయద్ సలావుద్దీన్ కుమారుడు సైయద్ అబ్దుల్ ముయీద్ కూడా ఉన్నారు. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శాఖలోని సమాచార, సాంకేతిక విభాగం మేనేజర్‌గా ముయూద్ ఉన్నాడు. ఈ నలుగురు ఉద్యోగులను రాజ్యాంగంలోని 311 ఆర్టికల్ కింద సర్వీసు నుంచి తొలగించారు. దర్యాప్తు లేకుండానే తమ ఉద్యోగులను తొలగించే అధికారాన్ని ప్రభుత్వానికి ఈ అధికరణ కల్పిస్తుంది.


ఫరూక్ అమ్మద్ డర్ అలియాస్ బిట్టా కరాటే ప్రస్తుతం ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆయన భార్య అస్సాబా-ఉల్-అర్జమాండ్ ఖాన్  జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీ్స్ ఆఫీసర్‌గా రూరల్ డవలప్ డైరెక్టరేట్‌లో ఉన్నారు. కాగా, సర్వీసు నుంచి ప్రభుత్వం తొలగించిన తక్కిన ఇద్దరిలో సైంటిస్ట్ డాక్టర్ ముహీద్ అహ్మద్ భట్, కశ్మీర్ యూనివర్శిటీ సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మజిద్ హుస్సేన్ ఖాదిరి ఉన్నారు.


Updated Date - 2022-08-13T20:12:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising