ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూలై నాటికి ఎలిఫెంట్‌గేట్‌ రైల్వే వంతెన

ABN, First Publish Date - 2022-01-20T14:16:15+05:30

గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఎలిఫెంట్‌గేట్‌ రైల్వే వంతెన జూలై నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి కేఎన్‌ నెహ్రూ తెలిపారు. వాల్‌టాక్స్‌ రోడ్డు ఎలిఫెంట్‌గేట్‌లో ప్రాచీన రైలు వంతెన ఉండేది. ఆ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                 - మంత్రి నెహ్రూ వెల్లడి 


అడయార్‌(చెన్నై): గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఎలిఫెంట్‌గేట్‌ రైల్వే వంతెన జూలై నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి కేఎన్‌ నెహ్రూ తెలిపారు. వాల్‌టాక్స్‌ రోడ్డు ఎలిఫెంట్‌గేట్‌లో ప్రాచీన రైలు వంతెన ఉండేది. ఆ వంతెన బాగా శిథిలావస్థకు చేరుకోవడంతో గత ప్రభుత్వ హయాంలో కూల్చివేశారు. ముఖ్యంగా రైల్వే శాఖ, ప్రభుత్వం కలిసి నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. ఐదేళ్ళ క్రితం కూల్చివేసిన ఈ వంతెన నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హార్బర్‌ ఎమ్మెల్యే, మంత్రి పీకే శేఖర్‌బాబు విఙ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ వంతెన నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి కేఎన్‌ నెహ్రూ, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేడీ, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కేఎన్‌ నెహ్రూ మాట్లాడుతూ, ఈ వంతెన నిర్మాణ పనులను ఐదేళ్ళ క్రితం గత అన్నాడీ ఎంకే ప్రభుత్వంలో ప్రారంభించారని, డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. ఈ వంతెన నిర్మాణ పనులను జూలై నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణ పంచాయతీల్లో గత వర్షాలకు దెబ్బతిన్న రహదారులను రూ.1000 కోట్లతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తున్నట్టు తెలిపారు. అలాగే, వర్షపునీటి కాల్వల నిర్మాణం, పూడికతీత పనుల కోసం టెండర్లను ఆహ్వానించామని, వాటిని ఖరారు చేసిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభిస్తామని మంత్రి కేఎన్‌.నెహ్రూ తెలిపారు. 

Updated Date - 2022-01-20T14:16:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising