ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ అరెస్ట్ చేయగానే పుష్ప రియాక్షన్ ఇచ్చిన జిగ్నేష్

ABN, First Publish Date - 2022-04-26T00:15:32+05:30

కాంగ్రెస్ నేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని అసోం పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. ప్రధాని మోడీపై వివాదాస్పద ట్వీట్ల కేసులో సోమవారం బెయిల్ పొందిన కొద్దిసేపటికే కొత్త కేసులో జిగ్నేష్‌ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పుష్ప సినిమాలోని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువహాటి: కాంగ్రెస్ నేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని అసోం పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. ప్రధాని మోడీపై వివాదాస్పద ట్వీట్ల కేసులో సోమవారం బెయిల్ పొందిన కొద్దిసేపటికే కొత్త కేసులో జిగ్నేష్‌ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పుష్ప సినిమాలోని రియాక్షన్ ఇచ్చారు జిగ్నేష్. పోలీసు జీపులో ఉన్న జిగ్నేష్ పక్కన పోలీసులు ఆయుధాలతో ఉన్నారు. జీపు కదులుతోంది. ఇంతలో కెమెరావైపుకు చూసిన జిగ్నేష్.. ‘తగ్గేదేలే’ అంటూ రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇదిలా ఉంటే రెండోసారి అరెస్ట్ చేసిన కేసేంటో పోలీసులు ఇప్పటి వరకు వరకు వెళ్లడించలేదు. గత బుధవారం రాత్రి 11 గంటల సమయంలో గుజరాత్‌లోని పాలంపూర్ ప్రాంతంలో జిగ్నేష్ మేవానీని అసోంకు చెందిన పోలీసు బృందం అరెస్ట్ చేసింది. ప్రధాని మోడీని వ్యతిరేకిస్తూ జిగ్నేష్ మేవానీ చేసిన రెండు ట్వీట్లే ఇందుకు కారణమయ్యాయి. ట్వీట్లపై అభ్యంతరం తెలుపుతూ అసోంకు చెందిన ఓ వ్యక్తి స్థానిక కోక్రఝర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేరపూరిత కుట్ర, మతఘర్షణలకు దారితీసేలా రెచ్చగొట్టడంతోపాటు ఇతర అంశాలను పేర్కొన్న పోలీసులు విచారణ నిమిత్తం మేవానీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.



Updated Date - 2022-04-26T00:15:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising