ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లీటరు పెట్రోల్, డీజిల్‌పై రూ.25 సబ్సిడీ

ABN, First Publish Date - 2022-01-26T22:16:18+05:30

పేదరికపు రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు జార్ఖాండ్ ప్రభుత్వం శుభవార్త..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచీ: పేదరికపు రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు జార్ఖాండ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలపై 25 రూపాయల సబ్సిడీని ప్రకటించింది. ఈ బుధవారం (రిపబ్లిక్ డే) నుంచి ఇది అమలులోకి వచ్చినట్టు తెలిపింది. పింక్, గ్రీన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం నెలకు 10 లీటర్ల వరకూ సబ్సిడీని పొందవచ్చని, ద్విచక్ర వాహనదారులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. సబ్సిడీ మొత్తం (రూ.250) వినియోగదారుల బ్యాంకు అకౌంట్‌కు డైరెక్ట్ బెనిపిట్ ట్రాన్స్‌ఫర్ సిస్టిం ద్వారా చేరుతుందని తెలిపింది. లబ్ధిదారులు పెట్రోల్, డీజిల్ సబ్సిడీ పొందాలంటే యాప్‌లో ఆధార్ కార్డు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.


ఈ స్కీమును ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు, వ్యవసాయ పనుల కోసం పంప్‌లు వినియోగించే రైతులకు లబ్ధి చేకూరేలా డిజైన్ చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. స్కీమ్ దుర్వనియోగం కాకుండా ఉండేందుకే 10 లీటర్ల కనీస పరిమితిని విధించినట్టు పేర్కొంది. కాగా, గత నెలలోనే ఈ స్కీమ్‌ను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. నిరంతర పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం పేదలు, మధ్యతరగతి వర్గాలపై ఎక్కువగా ప్రభావం చూపుతోందని, ఆ కారణంగానే ద్విచక్ర వాహనదారులకు లీటరుకు రూ.25 రూపాయల మేరకు ఉపశమనం కలిగంచనున్నామని ఆయన ప్రకటించారు. జనవరి 26వ తేదీ నుంచి స్కీమ్ అమలు చేస్తామని తెలిపారు. జేఏఎం సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా హేమంత్ సోరెన్ ఈ ప్రకటన చేశారు.

Updated Date - 2022-01-26T22:16:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising