ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జెలెన్‌స్కీ హత్యకు మూడుసార్లు కుట్ర?

ABN, First Publish Date - 2022-03-05T07:03:34+05:30

జెలెన్‌స్కీ హత్యకు మూడుసార్లు కుట్ర?...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్‌/మాస్కో, మార్చి 4: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని హతమార్చడమే రష్యా లక్ష్యమా? ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ప్రైవేటు సైన్యాన్ని కీవ్‌ నగరానికి పంపిందా? వారం రోజుల్లోనే మూడు సార్లు హత్యకు ప్రయత్నించిందా? అవునంటోంది లండన్‌కు చెందిన ఓ మీడియా కథనం. దీని ప్రకారం.. జెలెన్‌స్కీని హత్య చేసేందుకు రష్యా మద్దతు ఉన్న వాగ్నర్‌ గ్రూప్‌, చెచెన్‌ రెబెల్స్‌ అనే రెండు బృందాల ప్రైవేటు సైన్యం ఉక్రెయిన్‌ చేరింది. జెలెన్‌స్కీని హతమార్చేందుకు మూడు సార్లు కుట్ర పన్నింది. కానీ, ఉక్రెయిన్‌ దళాల అప్రమత్తతతో.. వారి యత్నాలు భగ్నమయ్యాయి. ఇదే విషయాన్ని ఉక్రెయిన్‌ నేషనల్‌ సెక్యూరిటీ అండ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ ఒలెక్సీ డానిలోవ్‌ కూడా వెల్లడించారు. రష్యా యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తున్న ఆ దేశ ఫెడరల్‌ సెక్యూరిటీ బ్యూరో (ఎఫ్‌ఎ్‌సబీ) జెలెన్‌స్కీ హత్యకు కుట్ర జరుగుతోందని ముందుగానే హెచ్చరించిందని తెలిపారు. దీంతో తమ దళాలు.. కీవ్‌ సరిహద్దుల్లోనే వాగ్నర్‌ గ్రూపునకు చెందిన చాలామందిని హతమార్చాయని చెప్పారు. అలాగే, చెచెన్‌ రెబెల్స్‌ను కూడా దీటుగా ఎదుర్కొన్నామన్నారు. కాగా, తనతో నేరుగా చర్చలకు రావాలంటూ జెలెన్‌స్కీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఆహ్వానించారు.

రష్యా సైనికులు ఉక్రెయిన్‌ను వీడండి..

ఇలా వ్యాఖ్యానించింది ఓ రష్యా సైనికుడు. ఉక్రెయిన్‌ దళాలకు చిక్కి.. కళ్లకు గంతలతో ఓ గదిలో బందీగా ఉన్న  అతడు.. తమ దళాలకు ఓ వీడియో సందేశం పంపించాడు. మీ సైన్యానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగినప్పుడు.. ‘‘నేను మా సైనికులకు ఒకటే చెప్పాలనుకుంటున్నా.. వెంటనే ఉక్రెయిన్‌ను వీడి ఇళ్లకు వెళ్లిపోండి. వాళ్లు మనల్ని మాయ చేసి, ఉచ్చులో బంధించేందుకు చూస్తున్నారు’’ అని చెప్పాడు.


టీవీ చానల్‌ ఉద్యోగుల రాజీనామా!

రష్యా యుద్ధోన్మాదంపై ఆ దేశంలోనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా టీవీ రెయిన్‌ అనే టీవీ చానల్‌ ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌పై దాడికి నిరసనగా.. తమ ఉద్యోగాలకు సామూహికంగా రాజీనామాలు చేసేశారు. అంతకుముందు ‘యుద్ధం వద్దు’ అనే ప్రకటనను చివరిసారిగా ప్రసారం చేసి ఆ చానల్‌ను మూసేశారు. అనంతరం ఉద్యోగులంతా మూకుమ్మడిగా కార్యాలయం నుంచి వాకౌట్‌ చేసి బయటకు వచ్చేశారు. దీంతో.. తమ చానల్‌ ప్రసారాలను నిరవధికంగా ఆపేస్తున్నామని యాజమాన్యం ప్రకటించింది. కాగా, ఉక్రెయిన్‌తో యుద్ధంపై తప్పుడు కథనాలు, వార్తలు ప్రచారం చేస్తే.. జైలు శిక్ష విధించాలన్న ఓ బిల్లుకు రష్యా పార్లమెంటు ఉభయ సభలూ హడావుడిగా ఆమోదం తెలిపాయి.

Updated Date - 2022-03-05T07:03:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising