ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఈఈ మెయిన్స్ 2022 షెడ్యూల్ విడుదల

ABN, First Publish Date - 2022-03-02T00:54:24+05:30

దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2022 పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ). వచ్చే ఏప్రిల్, మే నెలల్లో రెండు దశలుగా ఈ పరీక్షలు జరగనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2022 పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ). వచ్చే ఏప్రిల్, మే నెలల్లో రెండు దశలుగా ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇంతకుముందు నాలుగుసార్లు పరీక్ష రాసే అవకాశం ఉండగా, ఈ ఏడాది దీన్ని రెండుసార్లకు మాత్రమే పరిమితం చేసింది ఎన్‌టీఏ. తాజా షెడ్యూల్ ప్రకారం మార్చి 1 నుంచి 31 వరకు జేఈఈకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మొదటి దశ పరీక్షలు ఏప్రిల్ 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో, రెండో దశ పరీక్షలు మే 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో జరుగుతాయి.


పరీక్షలకు వయో పరిమితి లేదు. కానీ, 2020, 2021లో ప్లస్ టు లేదా ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు అర్హులు. అలాగే ఈ ఏడాది ఇంటర్ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా అర్హులే. తెలుగుతోపాటు మొత్తం పదమూడు భాషల్లో ఎగ్జామ్ రాసే వీలుంది. రెండేళ్లుగా కరోనా వల్ల జేఈఈ షెడ్యూల్‌ గందరగోళంగా తయారైంది. విద్యార్థులు కోచింగ్ తీసుకోవడం కూడా కష్టమైంది. అయితే, ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యార్థులంతా నగరాలకు వెళ్లి కోచింగ్ తీసుకుని, పరీక్షలకు పూర్తి స్థాయిలో ప్రిపేరయ్యే అవకాశాలున్నాయి. అయితే, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. ఈ  నేపథ్యంలో బోర్డ్ ఎగ్జామ్స్‌తో, జేఈఈ పరీక్షలు క్లాష్ అవుతాయేమోనని విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2022-03-02T00:54:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising