ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

controversial remarks:వారికి మద్యం దొరకడం లేదు...మీడియా ప్రతినిధులపై జేడీయూ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-08-24T17:21:09+05:30

బీహార్ జనతాదళ్ యునైటెడ్ అధ్యక్షుడు(JD-U president) రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్(Rajiv Ranjan) మీడియా ప్రతినిధులపై వివాదాస్పద వ్యాఖ్యలు(controversial remarks)...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా(బీహార్): బీహార్ జనతాదళ్ యునైటెడ్ అధ్యక్షుడు(JD-U president) రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్(Rajiv Ranjan) మీడియా ప్రతినిధులపై వివాదాస్పద వ్యాఖ్యలు(controversial remarks) చేశారు. బీహార్(Bihar) రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విజయవంతంగా అమలు చేస్తున్న నేపథ్యంలో మీడియా ప్రతినిధులు(media persons) సీఎం నితీష్ కుమార్ పై  కోపంతో ఉన్నారని రాజీవ్ రంజన్ వ్యాఖ్యానించారు. బీహార్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, వినియోగం జరగకుండా సీఎం గట్టి చర్యలు తీసుకోవడం వల్ల మీడియా ప్రతినిధులకు మద్యం తాగడానికి దొరకడం లేదని, అందువల్ల వారు ఆగ్రహంతో ఉన్నారని రాజీవ్ రంజన్ ఆరోపించారు. 


రాష్ట్రంలోని మహిళల కోసం మద్య నిషేధం(liquor ban) అమలు చేస్తున్నారని, కాని మీడియా ప్రతినిధుల సంతోషం కోసం మద్యనిషేధాన్ని ఎత్తివేయలేదమని జేడీయూ చీఫ్ చెప్పారు.లఖిసరాయి జిల్లాల్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాజీవ్ రంజన్ ఈ వ్యాఖ్యలు చేశారు.నితీష్ కుమార్ సర్కారు 2016 వ సంవత్సరం ఏప్రిల్ నుంచి సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేస్తున్నందు వల్ల బీహార్ రాష్ట్రంలో గృహహింస కేసులు తగ్గాయని రాజీవ్ రంజన్ వివరించారు. 


Updated Date - 2022-08-24T17:21:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising